Elephant: ఏనుగును కర్రతో కొట్టాడు.. అది చూస్తూ ఊరుకుంటుందా..? దెబ్బకు పరుగందుకున్న యువకుడు..
ఏనుగుకు కోపం వచ్చిందంటే దానిని ఎవరూ అదుపుచేయలేరు. దొరికిన వాళ్లను దొరికినట్లు తొండంతో విసిరి అవతల పడేస్తుంది. పెద్ద వీరంగమే సృష్టిస్తుంది. అందుకే అకారణంగా ఏనుగు జోలికి పోకూడదు.
ఏనుగుకు కోపం వచ్చిందంటే దానిని ఎవరూ అదుపుచేయలేరు. దొరికిన వాళ్లను దొరికినట్లు తొండంతో విసిరి అవతల పడేస్తుంది. పెద్ద వీరంగమే సృష్టిస్తుంది. అందుకే అకారణంగా ఏనుగు జోలికి పోకూడదు. ఒక వేళ వెళ్లారో.. పరిస్థితి ఇలాగే ఉంటుంది.వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ చోట కొన్ని ఏనుగులు గుంపుగా ఉన్నాయి. వాటి మానాన అవి మేత మేస్తూ ఉన్నాయి. ఇంతలో ఓ ఇద్దరు యువకులు అక్కడికి వచ్చారు. వారిలో ఓ యువకుడు ఆ ఏనుగుల గుంపులో ఓ ఏనుగును పొడవాటి కర్రతీసుకొని అకారణంగా కొట్టాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ గజరాజు నన్నే కొడతావా.. అంటూ ఒక్కసారిగా యువకులపైకి దూసుకొచ్చింది. అంతే దెబ్బకు ఆ కుర్రాళ్లు పరుగులంకించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ అధికారి సురేంద్ర మెహ్రా ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ‘ఇదోరకమైన పిచ్చి..’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇది చూసిన నెటిజన్లు.. యువకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. అకారణంగా మూగజీవులను హింసిస్తే అలాగే ఉంటుంది.. తిక్క కుదిరింది అంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

