Egg In Space: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘కోడిగుడ్డు’.. నెట్టింట వైరల్‌ అవుతున్న సూపర్‌ ప్రయోగం

ఆకాశంలోకి రాకెట్ సహాయంతో గుడ్డును తీసుకెళ్లి అక్కడి నుంచి దానిని కిందకు వదిలారు. రాకెట్ పడే చోట ఒక పరుపును ఏర్పాటు చేశారు. అయితే, అనేక ప్రయత్నాల

Egg In Space: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘కోడిగుడ్డు’.. నెట్టింట వైరల్‌ అవుతున్న సూపర్‌ ప్రయోగం

|

Updated on: Dec 13, 2022 | 9:46 AM


నాసా మాజీ ఇంజనీర్, ప్రముఖ యూట్యూబర్ మార్క్ రాబర్.. గుడ్డుపై ఓ ప్రయోగాన్ని చేశారు. గుడ్డును అంతరిక్షం నుంచి కిందకు పడేస్తే అది పగులుతుందా లేదా చూద్దాం అనుకున్నారు. అంతే రాకెట్‌లో అంతరిక్షానికి గుడ్డును తీసుకెళ్లారు. ఎత్తైన ప్రదేశం నుంచి గుడ్డును పడేసినా పగలకుండా ల్యాండ్ చేయడమే ఈ ప్రయోగం లక్ష్యం. అయితే, ముందుగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం అయిన దుబాయ్‌లోని బూర్జ్‌ ఖలీఫా నుంచి గుడ్డును వదలాలని ప్లాన్స్ వేశాడు. కానీ, అంతలోనే తన మనసును మార్చుకుని అంతరిక్షం నుంచి గుడ్డును విసరాలని భావించాడు. ఇంకేముంది.. ఆ మేరకు ప్లాన్ చేశాడు.ఆకాశంలోకి రాకెట్ సహాయంతో గుడ్డును తీసుకెళ్లి అక్కడి నుంచి దానిని కిందకు వదిలారు. రాకెట్ పడే చోట ఒక పరుపును ఏర్పాటు చేశారు. అయితే, అనేక ప్రయత్నాల తరువాత ఈ ప్రయోగం సక్సెస్ అయ్యింది. నాసా ఇంజినీర్ అయిన ఆడమ్ స్టెల్జ్నర్ సహాయంతో గుడ్డు పగలకుండా సక్సెస్‌ఫుల్‌గా జారవిడిచారు. అంతరిక్షం నుంచి వదిలిన గుడ్డు.. నేలపై పడనే పడింది. అయితే, ఆ గుడ్డు క్షేమంగా, కనీసం ఎలాంటి గీతలు కూడా లేకుండా ల్యాండ్ అయ్యింది. ఆ గుడ్డును తీసుకుని ముద్దాడాడు. అయితే, ఈ వీడియోకు 10 రోజుల్లోనే 25 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Snake Bathing: నువ్వు తోపువి బాసూ.. కింగ్‌ కోబ్రాకి స్నానమా..! మగ్‌పై పలుమార్లు కాటు వేసిన పాము.. వీడియో.

Romance Before Marriage: పెళ్లికిముందే శృంగారం చేస్తే ఇక అంతే..! కొత్త చట్టం తీసుకురానున్న ప్రభుత్వం.

Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్‌ ప్రకటన..

Follow us