Amazing Waterfalls : ఇలాంటి జలపాతాన్ని ఎప్పుడూ చూసి ఉండరు..! బ్యూటీ ఆఫ్ నేచర్.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..
చుట్టూ పచ్చని చెట్లు.. ఆ చెట్ల మధ్య నీటి ధార.. దూరం నుంచి చూస్తే అది పాల పొంగులా కనిపిస్తుంది. కానీ అది జలపాతం. ఆ వాటర్ ఫాల్ అందాలను చూస్తుంటే.. మనసులో ఏదో తెలియని అనుభూతి..
ప్రకృతి అందాలను ఆస్వాదించడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. రైల్లోనో, విమానంలోనో ప్రయాణిస్తున్నప్పుడు అనుకోకుండానే మనసు ప్రకృతివైపు పరుగులు తీస్తుంది.చుట్టూ పచ్చని చెట్లు.. ఆ చెట్ల మధ్య నీటి ధార.. దూరం నుంచి చూస్తే అది పాల పొంగులా కనిపిస్తుంది. కానీ అది జలపాతం. ఆ వాటర్ ఫాల్ అందాలను చూస్తుంటే.. మనసులో ఏదో తెలియని అనుభూతి.. అలాంటి అద్భుతమైన అనుభూతిని ఆస్వాదించానంటూ మేఘాలయ ముఖ్యమంత్రి కొన్రాడ్ సంగ్మా ఓ వీడియోను తన ఇన్‌స్టాలో పోస్టు చేశారు.ముఖ్యమంత్రి సంగ్మా.. జైంతియా హిల్స్‌కు హెలికాప్టర్‌లో ప్రయాణిస్తుండగా.. ఓ అద్భుతమైన జలపాతం ఆయన కంటపడింది. ఇంకేముంది ఆ రమణీయ దృశ్యాన్ని మిస్ కాకూడదనుకున్న ఆయన క్షణాల్లోనే తన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్‌లో బంధించారు. అనంతరం తన ఇన్‌స్టా గ్రాం ఖాతాలో ఆ వీడియోను షేర్ చేశారు. జైంతియా హిల్స్ వెళ్తుండగా అద్భుతమైన వాటర్ ఫాల్‌ను చిత్రీకరించాను. ఈ జలపాతం పేరేమిటో మీరు ఎవరైనా గెస్ చేయగలరా? అని ప్రశ్నించారు సంగ్మా. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. అయితే ఆ జలపాతం పేరును కూడా సంగ్మానే చెప్పారు. అది ఫీ ఫీ వాటర్ ఫాల్ అని తన ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. ఎవరైతే కరెక్ట్‌గా సమాధానం చెప్పారో వారికి కంగ్రాట్స్ కూడా చెప్పారు సీఎం. ఇది టు స్టెప్ వాటర్ ఫాల్ అని తెలిపారు. ఈ జలపాతం మేఘాలయలోని వెస్ట్ జైంతియా హిల్స్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..
చూస్తుండగానే కుప్పకూలిన మెట్రో పిల్లర్
ఈ భక్తి ఓ వింత .. ఆలయ గ్రిల్‌కు తాళాలు వేసే భక్తులు
వామ్మో.. వీళ్లు మామూలు ఆడోళ్లు కాదురోయ్..
హోటల్ బిల్లు కట్టలేదు.. రోడ్డున పడ్డ పాక్ హాకీ జట్టు
భర్తకు వాలంటైన్‌గిఫ్ట్ అందిస్తూ ..పోలీసు కేసులో చిక్కుకున్న మహిళ
'వయసు' పెరిగింది.. 'మనసు' మారింది!
నరహంతక బంటి..ఎట్టకేలకు చిక్కింది

