TamilNadu: యూట్యూబ్ లోచూసి భార్యకు కాన్పు చేసిన భర్త.. భార్య దుర్మరణం.

TamilNadu: యూట్యూబ్ లోచూసి భార్యకు కాన్పు చేసిన భర్త.. భార్య దుర్మరణం.

Anil kumar poka

|

Updated on: Aug 26, 2023 | 9:38 PM

యూట్యూబ్ లో వీడియో చూస్తూ భార్యకు కాన్పు చేయాలనుకున్న భర్త ప్రయత్నం ప్రాణాలమీదకే తెచ్చింది. ప్రసవం తరువాత తీవ్ర రక్తస్రావం కావడంతో భార్య మృతి చెందింది. సహజసిద్ధంగా ప్రసవం జరగాలన్న ఆ భార్యభర్తల కోరిక చివరకు విషాదాన్ని మిగిల్చింది. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హనుమంతపురానికి చెందిన మాదేశ్‌కు పొచ్చంపల్లి సమీపంలోని పులియంబట్టికి చెందిన వేడియప్పన్ కూతురు లోకనాయకితో రెండేళ్ల క్రితం వివాహమైంది.

యూట్యూబ్ లో వీడియో చూస్తూ భార్యకు కాన్పు చేయాలనుకున్న భర్త ప్రయత్నం ప్రాణాలమీదకే తెచ్చింది. ప్రసవం తరువాత తీవ్ర రక్తస్రావం కావడంతో భార్య మృతి చెందింది. సహజసిద్ధంగా ప్రసవం జరగాలన్న ఆ భార్యభర్తల కోరిక చివరకు విషాదాన్ని మిగిల్చింది. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హనుమంతపురానికి చెందిన మాదేశ్‌కు పొచ్చంపల్లి సమీపంలోని పులియంబట్టికి చెందిన వేడియప్పన్ కూతురు లోకనాయకితో రెండేళ్ల క్రితం వివాహమైంది. అగ్రికల్చర్ కోర్సులో డిగ్రీ చేసిన వారిద్దరూ తమ ఇంటి పెరట్లో సేంద్రీయ పద్ధతిలో పండించిన కూరలనే తినేవారు. ఇటీవల లోకనాయకి గర్భం దాల్చింది. అయితే ప్రసవం కూడా సహజపద్ధతిలో జరగాలని నిర్ణయించుకున్నారు. అది మొదలు మాదేశ్ యూట్యూబ్‌‌లో వీడియోలు చూస్తూ ప్రసవం ఎలా చేయాలనే విషయంపై అవగాహన పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే లోకనాయకికి నొప్పులు మొదలవడంతో మాదేశ్ తన యూట్యూబ్ జ్ఞానంతో ఆమెకు ప్రసవం చేశాడు. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన లోకనాయకికి ఆ తరువాత తీవ్ర రక్తస్రావమైంది. దీంతో, కంగారు పడిపోయిన మాదేశ్ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ప్రకటించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...