Weight Loss: ఒంట్లో కొవ్వు కరిగించడానికి కసరత్తులు చేయక్కర్లేదు.. వంటపై కాస్త శ్రద్ధ పెడితే సరి.!

Weight Loss: ఒంట్లో కొవ్వు కరిగించడానికి కసరత్తులు చేయక్కర్లేదు.. వంటపై కాస్త శ్రద్ధ పెడితే సరి.!

Anil kumar poka

|

Updated on: Jun 24, 2024 | 1:01 PM

నేటి గజిమిజి జీవనశైలి కారణంగా వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఊబకాయంతో బాధపడుతున్నారు. ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలంటే బరువు అదుపులో ఉండాలి. దీంతో బరువు తగ్గడం కోసం కొందరు రకరకాల తిప్పలు పడుతుంటారు. బరువు తగ్గాలంటే ఆహారం, వ్యాయామం అన్నీ తప్పనిసరి. అలాగే శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం.

నేటి గజిమిజి జీవనశైలి కారణంగా వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఊబకాయంతో బాధపడుతున్నారు. ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలంటే బరువు అదుపులో ఉండాలి. దీంతో బరువు తగ్గడం కోసం కొందరు రకరకాల తిప్పలు పడుతుంటారు. బరువు తగ్గాలంటే ఆహారం, వ్యాయామం అన్నీ తప్పనిసరి. అలాగే శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని తినడం ద్వారా సహజ సద్ధతుల్లో శరీర బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. రోజువారీ ఆహారంలో కొన్ని రకాల కూరగాయలను చేర్చుకోవడం వల్ల బరువు అదుపులో ఉంచుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. అటువంటి వాటిల్లో ముఖ్యమైనది సొరకాయ. ఇందులో 92 శాతం నీరు ఉంటుంది. ఈ కూరగాయలలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ కూడా అధికంగా ఉంటాయి. రోజూ ఉదయం ఖాళీ కడుపుతో సొరకాయ రసాన్ని తాగితే శరీరంలోని అదనపు కొవ్వు ఇట్టే కరిగిపోతుంది. అలాగే కాకరకాయ కూడా.. చాలా మంది కాకరకాయ పేరు వినగానే ముఖం చిట్లిస్తారు. నిజానికి ఇందులో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. మధుమేహం, హృద్రోగులు, బరువు తగ్గాలనుకునేవారు క్రమం తప్పకుండా కాకరకాయలను ఆహారంలో తీసుకోవాలి. ఇది కొవ్వును కరిగించడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను కూడా అదుపులో ఉంచుతుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.