ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. ఆ ఇంటి పెరట్లో కుప్పలుకుప్పలుగా పాములు వీడియో
ఉత్తరప్రదేశ్ లోని మీరట్ సమీపంలోని ఒక గ్రామంలో వల్లు గగురుపుట్టే ఘటన చోటుచేసుకుంది. ఓ రైతు ఇంటి పెరట్లో వందకు పైగా పాములు ఒక్కసారిగా బయటికి రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ అనుహ్య ఘటనతో ఆ గ్రామం ఉలిక్కిపడింది. ప్రాణభయంతో గ్రామస్తులు కర్రలతో కొట్టి 50కి పైగా పాములను చంపేశారు. సిమౌలి గ్రామానికి చెందిన మహఫూజ్ షైఫీ అనే రైతు ఇంటి పెరట్లో ఈ సంఘటన చోటుచేసుకుంది.
ఆదివారం రాత్రి మహఫూజ్ తన ఇంటి వాకిలి వద్ద మొదట ఒక పామును చూసి దానిని చంపేశారు. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే ఇంటి ప్రవేశ ద్వారం వద్ద ఉన్న కాంక్రీట్ ట్రాంప్ కింద నుంచి పాములు ఒకదాని తర్వాత ఒకటిగా పెద్ద సంఖ్యలో బయటికి రావడం మొదలయింది. ఈ పాముల గుంపును చూసి మహఫూజ్ కుటుంబంతో పాటు ఇరుగుపొరుగు వారు కూడా భయంతో వణికిపోయారు. వెంటనే అప్రమత్తమైన గ్రామస్తులు కర్రలతో కొట్టి 50కి పైగా పాములను చంపేశారు. వాటిని అక్కడే ఒక గొయ్యి తీసి పూడ్చిపెట్టారు. తాము అటవీశాఖ అధికారులకు సహాయం కోసం పలుమార్లు ఫోన్ చేసినా ఎవరూ స్పందించలేదని గ్రామస్తులు ఆరోపించారు. అయితే తమకు సహాయం కోసం ఎటువంటి అభ్యర్థనలు అందలేదని స్థానిక అధికారులు చెప్పడం గమనార్హం. ఈ విషయంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రంతా మరిన్ని పాములు బయటికి వస్తాయేమోనన్న భయంతో గ్రామస్తులు జాగారం చేశారు.
మరిన్ని వీడియోల కోసం :
“మూగ మనసులు’ సినిమాలో ..సావిత్రి నివాసం ఉన్న భవనం ఇదే వీడియో
ఫస్ట్‌నైట్ రోజున షాకింగ్ సీన్.. నవవధువు చేసిన పనికి వరుడు వీడియో
బీఎండబ్ల్యూ కాదు.. స్విఫ్ట్ కొనిస్తా’ తండ్రి చెప్పిన ఈ ఒక్క మాటతో.. కాసేపటికే వీడియో

ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్‌బాడీ మిస్టరీ వీడింది వీడియ

రైతు వేషంలో పోలీసులు.. తర్వాత ఏమైదంటే? వీడియో

వార్నీ.. ఇదేం బిజినెస్ రా అయ్యా వీడియో

దృశ్యం సినిమాను తలపించేలా వరుస చోరీలు వీడియో

వామ్మో .. ఎంత పని చేసిందీ కోతి.. రూ. 20 లక్షల విలువైన పర్సు చోరీ

కడుపునొప్పితో ఆస్పత్రికి మహిళ.. టెస్టులు చేయగా..

చేపలు వేటకు వెళ్లిన జాలర్లు.. సముద్రంలో తెలియాడుతున్నది చూసి
