Snake Viral Video: ఓరీ దేవుడో…ఇంట్లో ఇంత భారీ కొండ చిలువ..! చూసి వామ్మో అంటున్న జనాలు.. వైరల్ అవుతున్న వీడియో..
సాధారణంగా పాములు, కొండ చిలువలు అటవీ ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. కానీ ఈ మధ్య కాలంలో ఇళ్లల్లోకి చొరబడుతున్నాయి. పాములంటేనే జనాలు జంకుతుంటారు. అలాంటి ఓ కొండ చిలువ ఏకంగా ఇంట్లోనే దూరితే ఎలా ఉంటుంది..
సాధారణంగా పాములు, కొండ చిలువలు అటవీ ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. కానీ ఈ మధ్య కాలంలో ఇళ్లల్లోకి చొరబడుతున్నాయి. పాములంటేనే జనాలు జంకుతుంటారు. అలాంటి ఓ కొండ చిలువ ఏకంగా ఇంట్లోనే దూరితే ఎలా ఉంటుంది..పై ప్రాణాలు పైకే పోతాయి..ఇక్కడ అలాంటి ఘటనే జరిగింది… ఓ కొండ చిలువ ఏకంగా ఇంట్లో దూరి నానా హంగామా సృష్టించింది. ఈ ఘటన యూఎస్‌లోని సౌత్ ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. ఇంట్లో దూరిన కొండ చిలువ ఏకంగా ఇంట్లోని సీలింగ్‌లోకి దూరిపోయింది. అయితే కొండ చిలువను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే రెస్క్యూ టీమ్‌కు సమాచారం అందించారు.
ఆ భారీ కొండ చిలువను పట్టుకునేందుకు వచ్చిన రెస్క్యూ సిబ్బంది దానిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తే అతనిపైనే అటాక్ చేసేందుకు ప్రయత్నించింది. టోపీ చూపిస్తూ దానిని పట్టుకునేందుకు ప్రయత్నించినా.. కరిచేందుకు బుసలుకొట్టింది. చివరికి ఎలాగోల కష్టపడి దానిని పట్టుకుని వెళ్లిపోయారు సిబ్బంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన కొందరు జడుసుకుంటున్నారు. వామ్మో ఇంతపెద్ద కొండచిలువనా అంటూ కామెంట్లు చేస్తున్నారు. రెస్క్యూ టీమ్ సిబ్బంది చేసిన సహసానికి పలువురు ప్రశంసిస్తున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

