Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guinness Record: ఈ అమ్మాయి చాలా స్ట్రాంగ్‌ గురూ..! ఈమె చేసే అద్భుతాలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. వైరల్‌ వీడియో..

Guinness Record: గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు దక్కించుకోవడం అంటే అంత సులభమైన విషయం కాదు. ఎవరూ చేయలేని పనిని చేస్తే కానీ ఇందులో స్థానం దక్కించుకోలేము. ఇలా ఎంతో మంది తమ అసమాన..

Guinness Record: ఈ అమ్మాయి చాలా స్ట్రాంగ్‌ గురూ..! ఈమె చేసే అద్భుతాలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. వైరల్‌ వీడియో..
Linsey Lindberg
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 18, 2021 | 7:53 AM

Guinness Record: గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు దక్కించుకోవడం అంటే అంత సులభమైన విషయం కాదు. ఎవరూ చేయలేని పనిని చేస్తే కానీ ఇందులో స్థానం దక్కించుకోలేము. ఇలా ఎంతో మంది తమ అసమాన ప్రతిభతో గిన్నిస్‌ బుక్‌లో స్థానం సంపాదించుకుంటారు. దీనికోసం ఒక్కొక్కరు ఒక్కో దారిని వెతుక్కుంటారు. తాజాగా ఓ మహిళ ఓ అసాధారణ పనితో అందరి దృష్టిని ఆకర్షించడంతో పాటు గిన్నిస్‌ బుక్‌లోకెక్కింది. ఇంతకీ ఆ మహిళ సాధించిన ఘనత ఏంటనేగా..

లిన్సే లిండ్‌బర్గ్‌ అనే మహిళ చేతిలో ఏ వస్తువైనా పిండి కావాల్సిందే. యాపిల్స్‌ను చేతిలో మధ్యలో ఉంచి పిండి చేయడం, టెలిఫోన్‌ డైరెక్టరీని చించడం, దోసెల పెనంటను కాగితాన్ని మడిచినట్లు మడవడం లిండ్‌బర్గ్‌ ప్రత్యేకత. ఈ అసాధారణ పనులు చేసే.. లిండ్‌బర్గ్‌ అరుదైన గుర్తింపును సంపాదించుకుంది. కేవలం నిమిషంలోనే పది యాపిల్స్‌ను పిండి చేసినట్లు చేసేసింది. అంతేకాదు 5 డెక్‌ల కార్డ్‌లను 60 సెకన్లలో చించి పడేసింది. ఇవన్నీ చేసింది కాబట్టే ఆమె గిన్నిస్‌ బుక్‌లో స్థానం సంపాదించుకుంది. తాజాగా గిన్నిస్‌ రికార్డ్‌ నిర్వాహకులు లిండ్‌బర్డ్‌ సాహసాలకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. లిండ్‌బర్గ్‌ అద్భుత సాహసాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మరి నెట్టింట వైరల్‌ అవుతోన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..

Also Read: Talibans Letter to US: అలా చేయకుంటే ప్రపంచానికే ముప్పు.. అమెరికాకు తాలిబన్ సర్కార్ మరోసారి లేఖ!

Hill Stations: ప్రకృతి ఒడిలో సేదతీరాలనుకుంటున్నారా.. ఈ హిల్‌ స్టేషన్‌లు మీకు బెస్ట్‌..

అక్కడ భర్త చనిపోకముందే భార్యలు వితంతువులుగా మారుతారు..! ఎందుకో తెలుసా..?