Corn Field: మొక్కజొన్న పొలంలో తప్పిపోయిన చిన్నారిని వెదకడం కోసం వినూత్న నిర్ణయం.!
అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రం ఆల్టోలో ప్రాంతంలో మూడేళ్ల చిన్నారి దట్టమైన మొక్కజొన్న పొలంలో తప్పిపోయాడు. అది కూడా రాత్రి సమయం కావడంతో అతడి ఆచూకి కష్టతరంగా మారింది. సమాచారం పోలీసులకు అందడంతో రక్షించే ప్రయత్నాలు ప్రారంభించారు. అది రాత్రి సమయం కావడం, దానికి తోడు దట్టమైన మొక్కజొన్న పొలం కావడం వంటి కారణాల వల్ల చిన్నారి జాడ కనిపెట్టడం సాధ్యం కాలేదు.
అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రం ఆల్టోలో ప్రాంతంలో మూడేళ్ల చిన్నారి దట్టమైన మొక్కజొన్న పొలంలో తప్పిపోయాడు. అది కూడా రాత్రి సమయం కావడంతో అతడి ఆచూకి కష్టతరంగా మారింది. సమాచారం పోలీసులకు అందడంతో రక్షించే ప్రయత్నాలు ప్రారంభించారు. అది రాత్రి సమయం కావడం, దానికి తోడు దట్టమైన మొక్కజొన్న పొలం కావడం వంటి కారణాల వల్ల చిన్నారి జాడ కనిపెట్టడం సాధ్యం కాలేదు. దీంతో ఫాండ్ డు లాక్ కౌంటీ షెరీఫ్ పోలీసులు మొక్కజొన్న క్షేత్రాన్ని స్కాన్ చేసేందుకు థర్మల్ డ్రోన్‌ని మోహరించారు.
ఈ డ్రోన్ లోని ఇన్‌ఫ్రారెడ్ కెమెరా చిన్నారి ఉన్న ప్రదేశాన్ని గుర్తించడానికి వీలు కల్పించింది. ఆరడగుల పొడవైన కాండాలతో నిండిన మొక్కజొన్న పొలాన్ని డ్రోన్ సర్వే చేసి వీడియో తీయడం ప్రారంభించింది. నలుపు తెలుపు ఆకృతి నమునాలను ఇచ్చింది. ఆ తర్వాత అకస్మాత్తుగా ఒక ఆకారం మొక్కజొన్న గుండా కదలడం ప్రారంభించింది. స్క్రీన్‌పై ఏకరీతి నమునాకు అంతరాయం కనిపించడంతో..ఇది తప్పిపోయిన చిన్నారి కదలిక అని నిర్థారించారు. వెంటనే ఆ ప్రదేశానికి చేరుకునేలా అధికారులను అప్రమత్తం చేశారు.
ఆ తర్వాత బాలుడిని సురక్షితంగా మొక్కజొన్న పొలం నుంచి రక్షించి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. ఈ ఘటన సాంకేతికతంగా ప్రాముఖ్యత సంతరించుకుంది. దట్టమైన మొక్కజొన్న పొలం, రాత్రి సమయం వల్ల చిన్నారి ఆచూకి కనిపెట్టడం అంత సులభం కాలేదు. ఒకవేళ సాంకేతిక సాయం లేనట్లయితే గంటలకొద్ది సమయం పట్టుండేది. లేదా చిన్నారికి అనుకోని ఆపద ఏదైనా ఎదురయ్యేదని షెరీఫ్ కార్యాలయం అధికారులు అన్నారు. మొత్తానికి చిన్నారిని రక్షించగలిగారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.