Green Chilly Ice Cream: పచ్చిమిర్చీతో ఐస్ క్రీమ్.. టేస్ట్ చూస్తే దిమ్మతిరగాల్సిందే.. నెటిజన్స్ రియాక్షన్ మాములుగా లేదుగా..

Green Chilly Ice Cream: పచ్చిమిర్చీతో ఐస్ క్రీమ్.. టేస్ట్ చూస్తే దిమ్మతిరగాల్సిందే.. నెటిజన్స్ రియాక్షన్ మాములుగా లేదుగా..

Anil kumar poka

|

Updated on: Apr 17, 2022 | 9:48 AM

రెగ్యులర్‌ వంటకాలు తినీ తినీ విసుగొచ్చిందేమో కానీ ఇటీవల కొంతమంది వెరైటీ వంటకాలు తయారుచేస్తున్నారు. వివిధ రకాల కాంబినేషన్లతో వింత వింత వంటకాలు వండుతున్నారు. పైగా వాటిని సోషల్‌ మీడియాలో పంచుకుని మురిసిపోతున్నారు.


రెగ్యులర్‌ వంటకాలు తినీ తినీ విసుగొచ్చిందేమో కానీ ఇటీవల కొంతమంది వెరైటీ వంటకాలు తయారుచేస్తున్నారు. వివిధ రకాల కాంబినేషన్లతో వింత వింత వంటకాలు వండుతున్నారు. పైగా వాటిని సోషల్‌ మీడియాలో పంచుకుని మురిసిపోతున్నారు. అందులో కొన్ని ఫుడ్స్‌ బాగుంటే మరికొన్ని మాత్రం వికారం తెప్పిస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరలవుతోన్న వంటలను చూసి కొంతమంది ఆహార ప్రియులే వామ్మో అంటూ నోరెళ్లబెడుతున్నారు. చాక్లెట్ సమోసా.. ఐస్ క్రీం కచోరి, పచ్చి మిర్చి హల్వా, కొత్తిమీర ఐస్‌క్రీం, ఫాంటా మ్యాగీ ఇలా ఒక్కటేమిటీ.. ఎన్నో ఆహార పదార్థాలు నెట్టింట వైరల్ అయ్యాయి. కొందరు చేస్తున్న ఈ ప్రయోగాలను చూసి నెటిజన్లు ఇదేం పోయే కాలం రా.. అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ క్రమంలోనే మరో సరికొత్త వంటకం ట్రెండ్ అవుతోంది. అదే గ్రీన్‌ చిల్లీ ఐస్‌క్రీమ్‌ . ఈ ప్రయోగాన్ని చూసి ఐస్‌క్రీం ప్రియులు షాక్‌ తింటున్నారు.వైరలవుతోన్న ఈ వీడియోలో ముందుగా ఒక దుకాణదారుడు పచ్చి మిరపకాయలను ముక్కలుగా చేసి, వాటిపైన నుటెల్లా, మిల్క్‌ క్రీమ్‌, ఇతర పదార్థాలను వేసి ఐస్‌క్రీం రోల్స్‌ను తయారుచేసాడు. ఆ తర్వాత కొద్దిసేపు ఫ్రీజర్లో ఉంచి కస్టమర్లకు సర్వ్‌ చేసాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. సర్వ్‌ చేసే ముందు కూడా ఐస్‌క్రీం రోల్స్‌ను పచ్చిమిర్చీతో ట్యాపింగ్‌ చేసాడు. ఈ వెరైటీ వంటకాన్ని చూసి ఐస్‌క్రీం ప్రియులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.’నీదేం టేస్టురా బాబూ’, వాంతి వచ్చేలా ఉంది’, ‘ఇలాంటి వ్యక్తుల వల్లే కరోనా ఇంకా మనల్ని వీడడం లేదు’ అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మరి నెట్టింట వైరలవుతోన్న ఈ గ్రీన్‌ చిల్లీ ఐస్‌క్రీం వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని చూడండి ఇక్కడ:

Shashi Tharoor-Supriya Sule: నిండు సభలో సుప్రియతో అదేం పని శశిథరూర్‌.! వీడియో చుస్తే ఫ్యూజులు ఔట్ అంతే..

Ram Charan-Urfi Javed: రామ్ చరణ్ కు పడిపోయిన.. బాలీవుడ్ శృంగార తార.. ఓపెన్ ఆఫర్ అంటూ ఇలా..

Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..

Chimpanzee video: తగ్గేదే లే..! ఎంజాయ్ మీకే కాదు మాకు ఉంటది.. గేమ్స్‌తో చిల్‌ అవుతున్న చింపు..

Funny Video: అట్లుంటది మనతోని మరి.. ఒంటెతో యువతి సెల్ఫీ.. ఆ ఒంటె ఏంచేసిందో చూస్తే నవ్వాపుకోలేరు..!

Viral Video: ఓరి దేవుడా..! ఒక అబ్బాయి కోసం జుట్లు పట్టుకొని పొట్టు పొట్టుగా కొట్టుకున్న అమ్మాయిలు.. వైరల్ అవుతున్న వీడియో..

Police Dance Viral Video: ఏంటి మేము ఎం అయినా తక్కువ..! కచ్చా బాదం సాంగ్‌కు.. డ్యాన్స్‌ ఇరగదీసిన పోలీసులు.!