హిమగిరుల్లో అద్దాల ఇగ్లూలు.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు

Phani CH

Phani CH |

Updated on: Feb 04, 2023 | 9:24 AM

పర్యాటకులకు స్వర్గధామం జమ్ము కశ్మీర్. మంచు అందాలు పెనవేసుకొని ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులను ఆకర్షించే ప్రాంతమిది. కరోనా తగ్గుముఖం పట్టడం వల్ల ఇటీవల ఇక్కడికి వచ్చే పర్యటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

పర్యాటకులకు స్వర్గధామం జమ్ము కశ్మీర్. మంచు అందాలు పెనవేసుకొని ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులను ఆకర్షించే ప్రాంతమిది. కరోనా తగ్గుముఖం పట్టడం వల్ల ఇటీవల ఇక్కడికి వచ్చే పర్యటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వీరిని ఆకట్టుకునేందుకు స్థానిక హోటళ్లు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ కోవలోనే ఓ హోటల్.. అద్దాలతో చేసిన ఇగ్లూలను ఏర్పాటు చేసింది. చుట్టూ మంచు.. భారీగా హిమపాతం. వెచ్చటి అద్దాల గదిలో కూర్చొని ఆ అందాలను ఆస్వాదించడమంటే ఏదో ఫాంటసీలా ఉంటుంది కదూ! గుల్మార్గ్​లో ఉన్న కొలహోయి గ్రీన్ హైట్స్ అనే ప్రముఖ హోటల్ పర్యాటకులకు ఈ అనుభూతిని నిజం చేస్తోంది. గతంలో మంచుతో ఇగ్లూలను నిర్మించి ఆకట్టుకున్నారు నిర్వాహకులు.. తాజాగా అద్దాలగది లోపలి నుంచి మంచు అందాలు ఆస్వాదించే అవకాశం కల్పిస్తున్నారు. చైనా నుంచి దిగుమతి చేసుకొన్న ఫ్యాబ్రికేటెడ్‌ గ్లాస్‌తో ఇగ్లూలను నిర్మించినట్లు రెస్టారెంటు మేనేజర్‌ హమీద్‌ మసూది తెలిపారు. ఒక్కో ఇగ్లూలో గరిష్ఠంగా 8 మంది కూర్చోవచ్చని తెలిపారు. ఈ అద్దాల ఇగ్లూలో గడపడానికి 40 నిమిషాలకు 2 వేల రూపాయలు.. ఆహారానికి అదనంగా బిల్లు వసూలు చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విధిరాత అంటే ఇదే! సరిగ్గా ఇదే రోజు కళాతపస్వి మరణం

విశ్వనాథ్ స్వాతి ముత్యం అప్పట్లో ఆస్కార్‌కు వెళ్లింది.. తెలుసా ??

Ram Charan: బాలయ్య ముందు బాబాయ్‌కు ఫిట్టింగ్‌ పెట్టిన చరణ్ !!

పేరుకు పెద్ద డైరెక్టర్ !! కాని షూటింగ్‌లో వేసుకునేది కార్మికుల డ్రెస్స్‌

విశ్వనాథ్‌ సినిమాతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్‌ !!

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu