చిన్న మెకానిక్‌.. పెద్ద మనసు.. ఏం చేశాడో చూడండి

ఏపీలో భారీ వర్షాలు వరదలు కారణంగా విజయవాడ అతలాకుతలమైపోయింది. చాలా ఇళ్లు ఇప్పటికీ వరద నీటిలోనే ఉన్నాయి. వాహనాలు కొట్టుకుపోయాయి. ఇంట్లోని సామాన్లు కూడా వరదల్లో మునిగిపోయాయి. బాధితులను ఆదుకునేందుకు సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకూ తోచిన సహాయం చేస్తున్నారు. రోజుకూలీ చేసుకునే ఓ వ్యక్తి సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు తన రోజు కూలి డబ్బులు రూ.600లు విరాళంగా అందించి

చిన్న మెకానిక్‌.. పెద్ద మనసు.. ఏం చేశాడో చూడండి

|

Updated on: Sep 13, 2024 | 1:33 PM

ఏపీలో భారీ వర్షాలు వరదలు కారణంగా విజయవాడ అతలాకుతలమైపోయింది. చాలా ఇళ్లు ఇప్పటికీ వరద నీటిలోనే ఉన్నాయి. వాహనాలు కొట్టుకుపోయాయి. ఇంట్లోని సామాన్లు కూడా వరదల్లో మునిగిపోయాయి. బాధితులను ఆదుకునేందుకు సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకూ తోచిన సహాయం చేస్తున్నారు. రోజుకూలీ చేసుకునే ఓ వ్యక్తి సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు తన రోజు కూలి డబ్బులు రూ.600లు విరాళంగా అందించి అందరికీ స్పూర్తిగా నిలిచాడు. అందరూ డబ్బు సహాయం చేయలేకపోవచ్చు. కానీ మనసుంటే మార్గం ఉంటుంది… కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటే ఆ సంతృప్తే వేరుగా ఉంటుంది. అలాగే ఆలోచించాడు ఓ మెకానిక్‌. గ్యాస్‌ స్టవ్‌లు రిపేరు చేసుకుంటూ జీవనం సాగించే ఓ వ్యక్తి వరద బాధితులకు సహాయం చేయాలనుకున్నాడు. తన వద్ద డబ్బు లేకపోతేనేం.. తన వృత్తితోనే సహాయం చేస్తాను అనుకున్నాడు. విజయవాడలో వరద ముంపు కారణంగా ఇళ్లలోకి నీరు చేరి ఇంట్లోని వస్తువులు అన్నీ తడిచిపోయి పాడయ్యాయి. ఫ్రిజ్‌లు, ఏసీలు, వాషింగ్ మిషిన్స్, గ్యాస్ స్టవ్స్ అన్ని రిపేర్‌కు వచ్చాయి. ఈ క్రమంలో విజయవాడ విధ్యాదరపురంలో ఉచితంగా గ్యాస్ స్టవ్‌లు రిపేర్ చేస్తున్నాడు ఓ వ్యక్తి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దేవర సినిమాకు ముందుగా అనుకున్నది NTRని కాదట

Rana Daggubati: షారుఖ్ కాళ్లు మొక్కిన రానా.. దెబ్బకు అందరూ ఫిదా..

Prabhas: స్వాతంత్య్ర పోరాటంలో ప్రభాస్‌.. బిగ్ అప్డేట్‌ !!

స్టార్ సింగర్ కొడుకుల రౌడీ వేషాలు.. వేట మొదలెట్టిన పోలీసులు

‘దేవర సినిమా చూసి చచ్చిపోతా..’ క్యాన్సర్ పేషెంట్ ఆఖరి కోరిక

Follow us