స్టార్ సింగర్ కొడుకుల రౌడీ వేషాలు.. వేట మొదలెట్టిన పోలీసులు
సౌత్ ఇండియన్ స్టార్ సింగర్ .. మనో కుమారులు చిక్కుల్లో పడ్డారు. మద్యం మత్తులో తన ఫ్రెండ్స్‌తో ఓ టీస్టాల్ దగ్గర వీరంగం సృష్టించడమే కాదు.. ఓ ఇద్దరు టీనేజర్స్ పై దాడి చేశారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. దాంతో పాటే పోలీసుల వరకు వెళ్లింది. ఈ క్రమంలోనే పోలీసులకు చిక్కకుండా మనో కుమారులు ఇద్దరూ పరారీలో ఉండడం ఇప్పుడో బ్రేకింగ్ న్యూస్‌గా మారింది.
సౌత్ ఇండియన్ స్టార్ సింగర్ .. మనో కుమారులు చిక్కుల్లో పడ్డారు. మద్యం మత్తులో తన ఫ్రెండ్స్‌తో ఓ టీస్టాల్ దగ్గర వీరంగం సృష్టించడమే కాదు.. ఓ ఇద్దరు టీనేజర్స్ పై దాడి చేశారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. దాంతో పాటే పోలీసుల వరకు వెళ్లింది. ఈ క్రమంలోనే పోలీసులకు చిక్కకుండా మనో కుమారులు ఇద్దరూ పరారీలో ఉండడం ఇప్పుడో బ్రేకింగ్ న్యూస్‌గా మారింది. ఇక డీటెయిల్స్ లోకి వెళితే.. ! చెన్నై ఆలప్పాక్కానికి చెందిన కృపాకరన్, మదురవాయల్ ఇద్దరూ కాలేజీ విద్యార్థులు. వళసరవాక్కం శ్రీదేవికుప్పంలోని ఫుట్‌బాల్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నాడు. అలా అకాడమీ నుంచి తిరిగి వస్తూ.. స్థానికంగా ఉన్న టిఫిన్ సెంటర్లో ఆగారు. అదే సమయంలో మనో కుమారులు రఫీ, షకీర్‌లతోపాటు వారి స్నేహితులు మొత్తం 5 మంది అక్కడ ఉన్నారు. ఈ ఐదుగురు మద్యం మత్తులో కృపాకరన్‌తోపాటు మరో16 ఏళ్ల బాలుడైన మదరువాయిల్‌తో గొడవపడ్డారు. ఇక ఆ గొడవ కాస్తా ముదరడంతో ఆ ఇద్దరిపై దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కృపాకరన్ కీళ్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే .. వళసరవాక్కం పోలీసులకు సింగర్ మనో కుమారులు రఫి, షకీర్, వారి స్నేహితులు విఘ్నేష్, ధర్మ, జహీర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘దేవర సినిమా చూసి చచ్చిపోతా..’ క్యాన్సర్ పేషెంట్ ఆఖరి కోరిక
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

