Crime Video:రెచ్చిపోయిన కేటుగాళ్లు.. కేజీ బంగారం రూ.3 లక్షలే.. మరి కొన్న తర్వాత ఏమైంది.?
కామారెడ్డి జిల్లాలో కేటుగాళ్లు రెచ్చిపోయారు. తక్కువ ధరకే బంగారం ఇస్తామని చెప్పి, నకిలీ బంగారం అంటగట్టి లక్షలు దండుకొని పరారయ్యారు. అసలు విషయం తెలుసుకొని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. అసలు విషయం ఏంటంటే...
కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌కు చెందిన ఆనంద్ అనే వ్యక్తి స్థానికంగా ఓ బట్టల షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. జూన్ 14న ఇతని దుకాణానికి ఓ ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఇద్దరిలో ఒక మహిళ కూడా ఉన్నారు. ఆనంద్ షాపులో బట్టలు కొనుగోలు చేశారు. ఆ సమయంలో ఆనంద్‌తో మాటలు కలిపి తాము మధ్యప్రదేశ్‌నుంచి వచ్చామని, తమ వద్ద బంగారు హారం ఉందని, అవసరం ఉండి తక్కువ ధరకే అమ్మాలనుకుంటున్నామని నమ్మబలికారు. కావాలంటే బంగారం పరీక్షించుకోవచ్చని చెప్పారు. వారి మాటలు నమ్మిన ఆనంద్ బంగారాన్ని పరీక్షించగా ఒరిజినల్ అని నిర్ధారించుకుని వారికి 3 లక్షల రూపాయలు చెల్లించి హారం తీసుకున్నాడు. మూడు లక్షలు తీసుకొని వారిద్దరూ వెళ్లిపోయారు. అనంతరం ఆనంద్‌కు తాను కొనుగోలు చేసిన హారాన్ని మరోచోట పరీక్ష చేయించాడు. దాంతో అది నకిలీ బంగారంగా తేలింది. దాంతో షాకైన బాధితుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు సదాశివనగర్ పోలీసులు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్..