Boy Save Mother: స్విమ్మింగ్ పూల్‌లో మ‌హిళ‌కు ఫిట్స్‌.. అమ్మ పాలిట దేవుడైన ప‌దేళ్ల కొడుకు.. వైరల్ వీడియో.

Boy Save Mother: స్విమ్మింగ్ పూల్‌లో మ‌హిళ‌కు ఫిట్స్‌.. అమ్మ పాలిట దేవుడైన ప‌దేళ్ల కొడుకు.. వైరల్ వీడియో.

Anil kumar poka

|

Updated on: Sep 04, 2022 | 9:34 AM

నా అనేవాళ్లు ఆపదలో ఉంటే.. ఎంత సాహసానికైనా సిద్ధమవుతారు. కళ్లముందే తల్లి మునిగిపోతుంటే ఓ పదేళ్ల బాలుడు ప్రాణాలకు తెగించి కాపాడాడు. ఇంటి ఆవ‌ర‌ణ‌లో ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ పూల్‌లో


నా అనేవాళ్లు ఆపదలో ఉంటే.. ఎంత సాహసానికైనా సిద్ధమవుతారు. కళ్లముందే తల్లి మునిగిపోతుంటే ఓ పదేళ్ల బాలుడు ప్రాణాలకు తెగించి కాపాడాడు. ఇంటి ఆవ‌ర‌ణ‌లో ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతున్న లారీ కీనీ అనే మ‌హిళ‌కు ఆస్మాత్తుగా ఫిట్స్ వ‌చ్చాయి. దాంతో ఆమె ఈద‌లేక నీటిలో మునిగిపోతోంది. ఇది గ‌మ‌నించిన ఆమె ప‌దేళ్ల కొడుకు గ‌విన్ ప‌రుగున వ‌చ్చి, స్విమ్మింగ్ పూల్‌లో దూకి.. మునిగిపోతున్న త‌న త‌ల్లిని పూల్ మెట్ల వ‌ర‌కు లాక్కొచ్చాడు. అంత‌కంటే మీద‌కు లాగ‌డానికి బ‌లం చాల‌క‌పోవ‌డంతో.. అరుస్తూ చుట్టుపక్కల వారిని అప్రమత్తమం చేశాడు. దీంతో అత‌ని తాత‌య్య వ‌చ్చే వ‌ర‌కు త‌ల్లి త‌ల నీళ్లలో మున‌గ‌కుండా పైకి లేపి ప‌ట్టుకున్నాడు. ఆ త‌ర్వాత మ‌హిళ‌ను బ‌య‌టికి తీసుకొచ్చి ఆసుపత్రికి తరలించారు. బాలుడు మ‌హిళ‌ను కాపాడే స‌మ‌యంలో వారి పెంపుడు కుక్క కూడా స్విమ్మింగ్ పూల్‌ మెట్ల మీది వ‌ర‌కు ప‌రుగున వ‌చ్చింది. అవ‌స‌ర‌మైతే పూల్‌లో దూకేందుకు సిద్ధమైంది. మనసు కలచి వేసిన ఈ దృశ్యాలు.. మ‌హిళ ఇంట్లోని సెక్యూరిటీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటన అమెరికాలోని ఓక్ల‌హామా రాష్ట్రంలో ఆగ‌స్టు 6న జ‌రిగింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Bride Running on Road: నీ తల్లీ అంటూ మరోసారి తెలంగాణ శకుంతలను గుర్తు చేసిన మహిళా.. నన్ను పెళ్లి చేసుకుంటావా..లేదా..!

Mother sentiment: పసితనంలో తల్లిని పోగొట్టుకొని.. ఆమె తల్లి సమాధి వద్ద ఈ పిల్లాడు చేసిన పనికి మీకు కూడా కనీళ్లు ఆగవు..

Published on: Sep 04, 2022 09:34 AM