Fake Toll Plaza: ఘరానా మోసం..నకిలీ టోల్‌ప్లాజాతో కోట్లు కొట్టేశారు.! ఇంతకాలం గుర్తించలేదా.?

Fake Toll Plaza: ఘరానా మోసం..నకిలీ టోల్‌ప్లాజాతో కోట్లు కొట్టేశారు.! ఇంతకాలం గుర్తించలేదా.?

Anil kumar poka

|

Updated on: Dec 11, 2023 | 10:27 AM

గుజరాత్‌ లో మరోసారి నకిలీ వ్యవహారం కలకలం రేపింది. మోర్బీ జిల్లాలో కొందరు మోసగాళ్లు బైపాస్‌ రోడ్డును నిర్మించి.. మధ్యలో టోల్‌ ప్లాజా ఏర్పాటు చేశారు. ఏకంగా ఏడాదిన్నర పాటు వాహనదారుల నుంచి టోల్‌ వసూలు చేసి కోట్లు దండుకున్నారు. మోర్బీ, కచ్‌ జిల్లాలను కలిపే 8ఏ నంబరు జాతీయ రహదారిపై వాఘసియా టోల్‌ ప్లాజా ఉంది. ఈ టోల్‌ ప్లాజాను తప్పించుకునేందుకు కొందరు వాహనదారులు పక్కనే ప్రత్యామ్నాయంగా ఉన్న మరో మార్గంలో వెళ్తుండేవారు.

గుజరాత్‌ లో మరోసారి నకిలీ వ్యవహారం కలకలం రేపింది. మోర్బీ జిల్లాలో కొందరు మోసగాళ్లు బైపాస్‌ రోడ్డును నిర్మించి.. మధ్యలో టోల్‌ ప్లాజా ఏర్పాటు చేశారు. ఏకంగా ఏడాదిన్నర పాటు వాహనదారుల నుంచి టోల్‌ వసూలు చేసి కోట్లు దండుకున్నారు. మోర్బీ, కచ్‌ జిల్లాలను కలిపే 8ఏ నంబరు జాతీయ రహదారిపై వాఘసియా టోల్‌ ప్లాజా ఉంది. ఈ టోల్‌ ప్లాజాను తప్పించుకునేందుకు కొందరు వాహనదారులు పక్కనే ప్రత్యామ్నాయంగా ఉన్న మరో మార్గంలో వెళ్తుండేవారు. దీన్ని గమనించిన కొందరు మోసగాళ్లు.. ఈ మార్గంలో నిరుపయోగంగా ఉన్న ఓ సిరామిక్‌ ఫ్యాక్టరీని అద్దెకు తీసుకుని, దానికి ఇరువైపులా హైవే వరకు బైపాస్‌ రోడ్డును నిర్మించి.. ఫ్యాక్టరీలో టోల్‌ ప్లాజాను ఏర్పాటు చేశారు.

హైవేపై ఉన్న టోల్‌ ప్లాజా ఛార్జీల కంటే తక్కువగా వసూలు చేయడంతో వాహనదారులు కూడా దీనిపై ఎవరికీ ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. దీనిపై ఇటీవల స్థానిక మీడియాల్లో వార్తలు రావడంతో ఈ నకిలీ టోల్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో స్థానిక అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐదుగుర్ని అరెస్టు చేశారు. నిందుతుల్లో ఒకరు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి కాగా.. పాటిదార్‌ వర్గానికి చెందిన ప్రముఖ నేత కుమారుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఏడాదిన్నర కాలంలో ఈ నకిలీ టోల్‌ ప్లాజాతో నిందితులు వాహనదారుల నుంచి దాదాపు 75కోట్లు వసూలు చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే దీని గురించి తెలిసినా స్థానిక అధికారులు ఎవరూ ఎలాంటి చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.