టీసీ కొలువంటే నమ్మేశారట.. కోటు ఇస్తే రైలెక్కేశారట

ముగ్గురు యువకులు... ఉద్యోగాలు లేక ఓ అపరిచితుడ్ని నమ్మారు... అతడి చేతిలో లక్షల డబ్బు పెట్టారు! సీన్ కట్ చేస్తే... మీరు టీసీలు అయిపోయారు... ప్రస్తుతం మీకు ట్రైనింగ్... ఇదిగో కోటు... ఇవిగో ఐడీ కార్డులు... ఇవిగో జరిమానా రసీదు పుస్తకాలు... అంటూ ఆ యువకులను సదరు అపరిచితుడు మరింతగా నమ్మించాడు. అంతేకాదు, నిత్యం ఒంగోలు-విజయవాడ మధ్య రైళ్లలో తిరుగుతూ కనీసం మూడు కేసులు రాయాలని సూచించాడు.

టీసీ కొలువంటే నమ్మేశారట.. కోటు ఇస్తే రైలెక్కేశారట

|

Updated on: Dec 01, 2023 | 1:56 PM

ముగ్గురు యువకులు… ఉద్యోగాలు లేక ఓ అపరిచితుడ్ని నమ్మారు… అతడి చేతిలో లక్షల డబ్బు పెట్టారు! సీన్ కట్ చేస్తే… మీరు టీసీలు అయిపోయారు… ప్రస్తుతం మీకు ట్రైనింగ్… ఇదిగో కోటు… ఇవిగో ఐడీ కార్డులు… ఇవిగో జరిమానా రసీదు పుస్తకాలు… అంటూ ఆ యువకులను సదరు అపరిచితుడు మరింతగా నమ్మించాడు. అంతేకాదు, నిత్యం ఒంగోలు-విజయవాడ మధ్య రైళ్లలో తిరుగుతూ కనీసం మూడు కేసులు రాయాలని సూచించాడు. ఈ వ్యవహారం కాస్తా ఓ రైల్వే టీసీ గమనించి గట్టిగా ప్రశ్నించడంతో నకిలీ టీసీల భాగోతం బట్టబయలైంది. వరంగల్ జిల్లాకు చెందిన గణేశ్, కల్యాణ్… మహబూబాబాద్ కు చెందిన ప్రవీణ్ డిగ్రీ చదివారు. వారికి ఉద్యోగం లేదు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సాయిప్రసాద్ అనే వ్యక్తి వీరికి పరిచయమయ్యాడు. నిరుద్యోగంతో బాధపడుతున్న వారికి ఉద్యోగాల ఆశ చూపించాడు. రైల్వేలో టీసీ ఉద్యోగాలు అని చెప్పి వారి నుంచి లక్షల రూపాయలు వసూలు చేశాడు. కొన్ని రోజులు పోయాక మీకు టీసీ ఉద్యోగాలు వచ్చాయని చెప్పి, రైళ్లలో తిరుగుతూ కేసులు రాయాలని పురమాయించాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బందీలు విడుదలవుతున్న వేళ.. హమాస్‌ చెరలో 10 నెలల చిన్నారి మృతి

ఆక్సిజన్‌ సిలిండర్‌తో పోలింగ్‌ కేంద్రానికి.. అందరికీ వీళ్లు ఆదర్శం

మహిళల కోసం ప్రత్యేక పోలింగ్‌ బూత్‌లు.. సమీపంలో సెల్ఫీ పాయింట్‌ ఏర్పాటు

వావ్‌ !! ఓటీటీలోకి పొలిమేర2 డేట్ కన్ఫర్మ్

Allu Arjun: లేడీ ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చిన అల్లు అర్జున్

 

Follow us