Bride Slaps Groom: వివాహం జరిగే రోజున నవ వధువు భయం, సిగ్గుతో ఉంటుంది. తనలో ఎన్ని భావోద్వేగాలు ఉన్నా వాటన్నింటినీ మనసులోనే దాచుకొని బిడియంగా ఉంటుంది. అలాంటిది ఓ పెళ్లి కూతురు మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించింది. పెళ్లి జరుగుతున్న సమయంలో పెళ్లి పీటలపైనే వరుడి చెంప చెల్లుమనిపించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ పెళ్లి కూతురు, వరుడిని అలా ఎందుకు కొట్టిందనేగా.. అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
వివాహం జరుగుతున్న సమయంలో పూజారి మంత్రాలను చెబుతూ పెళ్లి కొడుకును చదవమన్నాడు. అయితే పెళ్లి కొడుకు మాత్రం మంత్రాలను సరిగా పలకడం లేదు. దీనికి కారణం వరుడు నోట్లో గుట్కా వేసుకొని పెళ్లి పీటలపై కూర్చొవడమే. దీంతో వరుడు గుట్కా నములున్నట్లు గుర్తించిన వధువు.. ఆయన చెంపను ఒక్కసారిగా చెళ్లుమనిపించింది. దీంతో వెంటనే పైకి లేచిన వరుడు నోట్లోని గుట్కాను పక్కన ఉమ్మేశాడు. ఇదంతా చూసిన బంధువులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు కొందరు పెళ్లి కూతురికి మద్ధతుగా కామెంట్లు పెడుతున్నారు.
Also Read: AP Heavy Rains: రానున్న 48 గంటలు ఏపీలో మోస్తారు వర్షాలు.. ఆ రెండు జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు!
Maruti Suzuki: మీరు కొత్త కారు కొనాలనుకుంటున్నారా..? అయితే రుణం పొందడం చాలా సులభం..!