AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lion Pats Duck: ఈతకొట్టలేక ఇబ్బంది పడుతున్న బాతుపిల్లకు సాయం అందించిన మృగరాజు.. Viral Video

Viral Video: అడవికి రారాజు సింహం. మృగరాజు వేటాడటం మొదలెడితే ఎంత పెద్ద జంతువులైనా సరే.. బయపడాల్సిందే. అలవోకగా ఎలాంటి జంతువులైనా...

Lion Pats Duck: ఈతకొట్టలేక ఇబ్బంది పడుతున్న బాతుపిల్లకు సాయం అందించిన మృగరాజు.. Viral Video
Lion Pats Duck
Surya Kala
| Edited By: Team Veegam|

Updated on: Mar 27, 2021 | 1:37 PM

Share

Lion Pats Duck: అడవికి రారాజు సింహం. మృగరాజు వేటాడటం మొదలెడితే ఎంత పెద్ద జంతువులైనా సరే.. బయపడాల్సిందే. అలవోకగా ఎలాంటి జంతువులైనా మట్టికరిపిస్తోంది. సింహం అంటేనే గాంభీర్యం..దాని అరుపు వింటేనే అడవి దద్దరిల్లుతుంది. మరి ఇంతపెద్ద మాంసాహార జంతువుకు ఓ మంచి మనసు ఉందని ఐఎఫ్‌ఎస్‌ అధికారి సుశాంత నంద సోషల్ మీడియా వేదికగా తెలిపారు.. అంతేకాదు నీలో ఉన్న మంచి మనసు ఎంతమందికి తెలుసు అంటూ ప్రశ్నించారు కూడా.

ఓ బాతు పిల్లకు సింహం సాయం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను ఐఎఫ్‌ఎస్‌ అధికారి సుశాంత నంద తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. అవి అడవి మృగాలే.. కానీ క్రూరమైనవి కాదు. అవి రెచ్చగొట్టినప్పుడు మాత్రమే చంపేందుకు తెగబడతాయి. వాటిని గౌరవించి ఆదరించండి అంటూ ఆ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు.

ఈ వీడియోలో..బాతుపిల్ల నీటిలో ఈత కొట్టలేక చాలా ఇబ్బందిపడుతోంది. అది గమనించిన సింహం వెంటనే బాతు పిల్ల వద్దకు వచ్చి..తన కాళ్లతో బాతుపిల్లను నీటిలోకి నెట్టింది. ఈ సందర్భంగా తన కాలితో బాతు పిల్లను మెల్లగా నిమురుతూ సముదాయించింది. బాతు పిల్లను రక్షించేందుకు సింహం చేసిన ప్రయత్నంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్న ప్రాణి పట్ల అది చూపిన దయాగుణం అందరి హృదయాలను గెలుచుకుంది.

Also Read: Ram Charan-RRR Update: రామరాజు లుక్ ని రిలీజ్ చేసిన చిత్ర యూనిట్.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్

మహేష్ బాబు రిజెక్ట్ చేస్తే.. ఆ సినిమా సూపర్ హిట్టేనా..? ఇప్పటి వరకూ ప్రిన్స్ వదులుకున్న హిట్ మూవీస్ ఏమిటో తెలుసా.?