Viral Video: వాచ్‌మెన్ అవతారమెత్తిన శునకం.. ఈ కుక్క చేస్తోన్న డ్యూటీ చూస్తే ఔరా అనాల్సిందే..
Viral Video: విశ్వాసానికి మారుపేరు శునకాలు. మనిషి అయినా మోసం చేస్తాడు కానీ.. కుక్కలు చేయవు అంటుంటారు. అంతలా మనిషి జీవితంలో శునకాలు ఓ భాగమై పోయాయి. ఈ క్రమంలోనే..
Viral Video: విశ్వాసానికి మారుపేరు శునకాలు. మనిషి అయినా మోసం చేస్తాడు కానీ.. కుక్కలు చేయవు అంటుంటారు. అంతలా మనిషి జీవితంలో శునకాలు ఓ భాగమై పోయాయి. ఈ క్రమంలోనే కొన్నిసార్లు శునకాలు చేసే పనులు మనకు ఆనందాన్ని పంచడంతో పాటు ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంటాయి. సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా శునకానికి సంబంధించిన ఇలాంటి ఓ వీడియోనే నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. ఓ శునకం గేట్ దగ్గర నిల్చొని ఉంది. ఆ సమయంలో ఓ కారు వచ్చింది. కారులో ఉన్న వ్యక్తి హారన్ మోగించగానే వెంటనే ఆ కుక్క గేట్ వద్దకు వెళ్లి గేట్ ఓపెన్ చేసింది. అనంతరం కారులో ఉన్న వ్యక్తిని గమనించిన శునకం.. మళ్లీ వెనక్కి వచ్చి అక్కడే టేబుల్‌పై ఉన్న రిజిస్టర్ బుక్‌ను తీసుకొచ్చి సదరు కారు డ్రైవర్‌కు అందించింది. కారులో ఉన్న వ్యక్తి ఆ రిజిస్టర్‌లో సంతకం చేయగానే తిరిగి ఆ బుక్‌ను తీసుకెళ్లి టేబుల్‌పై పెట్టింది. ఇదంతా అక్కడే ఉన్న ఓ వ్యక్తి కెమెరాలో బంధించాడు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇక ఈ సమయంలో ఆ శునకం యూనిఫామ్ ధరించడం మరో విశేషం. ‘యనిమాలజీ’ పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు సదరు శునకంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి వాచ్‌మెన్ అవతారమెత్తిన ఈ శునకంపై మీరూ ఓ లుక్కేయండి..
వైరల్‌గా మారిన శునకం వీడియో..
View this post on Instagram
Narendra Modi: నేడు ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. కోవిడ్ పరిస్థితులపై కీలక నిర్ణయాలు..!
KTR Tweet: ‘తెలంగాణ వస్తే ఏమొస్తది.. కన్నీరు కారిన చోటే’. ఆసక్తికర ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్..