Doctors Dance Videos: కరోనా దండయాత్రలో..ప్రజల నిరాశ నేట్టేయడానికి డాక్టర్లు వేసిన ఆశా మాత్రలు..ఈ వైరల్ వీడియోలు!

|

Apr 22, 2021 | 11:23 PM

కరోనాతో దేశవ్యాప్తంగా ఇబ్బందులు ఎక్కువైపోయాయి. కేసులు ఎన్నడూ లేని విధంగా పెరిగిపోతుండటం అందరినీ కలవర పెడుతోంది. మరోపక్క ఆసుపత్రుల్లో బెడ్ ల కొరత.. ఆక్సిజన్ దొరకకపోవడం ఇలా ఎన్నో ఇబ్బందులు చుట్టుముట్టేశాయి.

Doctors Dance Videos: కరోనా దండయాత్రలో..ప్రజల నిరాశ నేట్టేయడానికి డాక్టర్లు వేసిన ఆశా మాత్రలు..ఈ వైరల్ వీడియోలు!
Doctors Dance Videos
Follow us on

Doctors Dance Videos: కరోనాతో దేశవ్యాప్తంగా ఇబ్బందులు ఎక్కువైపోయాయి. కేసులు ఎన్నడూ లేని విధంగా పెరిగిపోతుండటం అందరినీ కలవర పెడుతోంది. మరోపక్క ఆసుపత్రుల్లో బెడ్ ల కొరత.. ఆక్సిజన్ దొరకకపోవడం ఇలా ఎన్నో ఇబ్బందులు చుట్టుముట్టేశాయి. ఈ నేపధ్యంలో ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు..వైద్య సిబ్బంది తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. అయినప్పటికీ వారి పని భారాన్ని వదిలించుకోవాలని అనుకోవడం లేదు. విపత్కర పరిస్థితుల్లో కరోనా పేషెంట్స్ లో ఆత్మస్థైర్యం నింపి వారికి మంచి చికిత్స చేసి బయటకు తీసుకురావడానికి రాత్రీ పగలూ కష్టపడుతున్నారు డాక్టర్లు. అయితే, వారు తమ స్ట్రెస్ తగ్గించుకోవడానికి.. పేషెంట్స్ కి ధర్యాన్ని ఇవ్వడానికి వివిధ పద్ధతుల్లో ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. వాటిలో సోషల్ మీడియాలో వారు చేస్తున్న వైరల్ గా మారిన పోస్టుల నుంచి కొన్ని పోస్టులు మీకోసం ఇక్కడ అందిస్తున్నాం..

ది సాంగ్ ఆఫ్ హోప్: ఆశాగీతం :
దేశవ్యాప్తంగా ఉన్న 60 మంది వైద్యులు ఈ వీడియోలో మనకు డ్యాన్స్ చేస్తూ కనిపిస్తారు. అందరిదీ ఒకే ఆశ.. కరోనా కష్టం త్వరగా వెళ్ళిపోవాలని. అదే ఆశను అందరికీ పంచుతూ పూర్తి పాజిటివ్ ధోరణి నెలకొల్పడానికి ఈ పాటతో వారు ప్రయత్నం చేశారు.

గంఘ్రూ డ్యాన్స్:
ఇది డాక్టర్ సయ్యద్ ఫైజాన్ అహ్మద్ గత అక్టోబర్ లో ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వీడియో. అస్సాంలోని సిల్చార్ మెడికల్ కాలేజీలో ఈఎన్టీ సర్జన్ డాక్టర్ అరూప్ సేనాపతి కోవిడ్ వార్డ్ లో నిరాశతో ఉన్న పేషెంట్స్ లో ఉత్సాహం నింపడం కోసం చేసిన ప్రయత్నామీ వీడియో..


ఏమీ జరగదు.. ఏమీ జరుగుతుందో చూద్దాం..
ఈ విడియో గుజరాత్ వడోదరా లోని పరుల్ సేవాశ్రం లో వీడియో తీశారు. మంబాయి కి చెందిన పాప్యులర్ వీడియో గ్రాఫర్ విరాల్ భయానీ దీనిని చిత్రీకరించారు. దీనిని ఆయనే గత వారం ఇంస్టా గ్రామ్ లో ఉంచారు. సన్నీడియోల్ ఘాయల్ సినిమాలోని పాటకు అనుగుణంగా అక్కడి మెడికల్ సిబ్బంది నృత్యం చేస్తుంటే.. కోవిడ్ బాధితులు తమ బాధను మరచిపోయి కేరింతలు కొడుతున్నారు ఈ వీడియోలో..


మెడికల్ స్టూడెంట్స్ డాన్స్..
కేరళ లోని త్రిశూర్ మెడికల్ కాలేజీ కారిడార్ లో ఈ డ్యాన్స్ చిత్రీకరించారు. ఇద్దరు మెడికల్ విద్యార్ధులు ఈ పాటకు చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాను ఒక ఊపు ఊపింది.

Also Read: Coronavirus: మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు… తాజాగా ఎన్ని కేసులో తెలిస్తే..

Indonesian Submarine : గల్లంతైన ఇండోనేషియా జలాంతర్గామి కోసం ముమ్మరంగా గాలింపు, రంగంలోకి భారత్