Taj Mahal: భారత్‌లోనే మరో తాజ్‌మహల్.. ఎక్కడో తెలుసా..? పూర్తి వివరాలతో ట్రెండ్ అవుతున్న వీడియో..
ఉత్తర్ ప్రదేశ్‌లోని ఆగ్రాలో ఉన్న తాజ్ మహాల్ ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటనే సంగతి అందరికీ తెలిసిందే. దీన్ని మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన సతీమణి ముమ్‌తాజ్..
ఉత్తర్ ప్రదేశ్‌లోని ఆగ్రాలో ఉన్న తాజ్ మహాల్ ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటనే సంగతి అందరికీ తెలిసిందే. దీన్ని మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన సతీమణి ముమ్‌తాజ్ మరణించాక ఆమె గుర్తుగా కట్టించాడు. 1632లో 20 వేలమంది కార్మికులు 20 ఏళ్లు కష్టపడి తాజ్‌మహల్‌ను నిర్మించారు. యమునా నది ఒడ్డున మొత్తం పాలరాతితో నిర్మించడంతో ఈ కట్టడం ఎవరినైనా ఇట్టే మంత్రముగ్ధుల్ని చేస్తుంది. తర్వాతి కాలంలో షాజహాన్ మరణించాక ఇక్కడే సమాధి చేశారు. ఆపై ఇది సందర్శనీయ స్థలంగా మారింది. దీన్ని 1983లో UNESCO World Heritage Siteగా గుర్తించింది. దీంతో దీనికి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కింది భారత దేశంలోనే అతిముఖ్యమైన టూరిస్ట్ స్పాట్‌గా విరాజిల్లుతోంది.
ఇదిలా ఉంటే.. మన దేశంలోనే తాజ్‌మహల్‌ని పోలిన మరికొన్ని కట్టడాలు కూడా వున్నాయి. అందులో ప్రధానమైనది మహారాష్ట్రలోని ఔరంగబాద్ పట్టణానికి సమీపంలో వున్న బీబీ కా మఖ్బరా.. ఇది కూడా అచ్చు తాజ్ మహల్‌ని పోలి వుంటుంది. కాగా మధ్య ప్రదేశ్‌లోని బుర్హాన్పూర్ సమీపంలో నల్లరాతితో నిర్మించిన కట్టడం కూడా అచ్చు తాజ్ మహల్‌లాగానే వుంటుంది. కాకపోతే దీనిని పూర్తిగా నల్ల గ్రనైట్‌తో నిర్మించడం వల్ల దీనిని కాలా తాజ్ అంటారు. దీన్ని కూడా 1622, 1623 కాలంలో నిర్మించారు. అప్పటి మొఘల్ ఆర్మీకి కమాండర్ అయిన షాహ్‌నవాజ్ ఖాన్ 44 ఏళ్లకే మరణించడంతో బుర్హాన్పూర్ సమీపంలోని ఉతవాలీ నది ఒడ్డున ఖననం చేశారు. అక్కడే ఈ కాలా తాజ్‌ను నిర్మించారు. ఆయన సతీమణిని కూడా తర్వాతి కాలంలో ఇక్కడే ఖననం చేశారు. దీంతో ఇది కూడా సమాధిగా మారిపోయింది. అయితే, ఈ కట్టడాన్ని నల్లరాతితో అచ్చం తాజ్ మహాల్ మాదిరే నిర్మించారు. అయితే ఇది షాజహాన్ నిర్మించిన తాజ్‌మహల్ కంటే చిన్న సైజులో ఉంటుంది. నలు దిక్కులా మినార్లు నిర్మించడంతో పాటు లోపలిభాగంలో అద్భుతమైన పెయింటింగ్స్ కూడా అందులో పొందుపరిచారు. ఈ కాలా తాజ్‌ను చూడటానికి కూడా పర్యాటకులు పెద్దసంఖ్యలో వస్తుంటారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..
Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

