Punjabi Dance: ఓర్నీ.. రోడ్డు మధ్యలో ఇదేం పనీరా సామీ.. ట్రాఫిక్ ఆపేసి మరీ.. వైరల్ అవుతున్న వీడియో..
అమెరికాలోని నడివీధిలో ఓ వ్యక్తి ట్రాఫిక్ ఆపేసి హల్‌చల్ చేశాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. హార్డీసింగ్ అనే వ్యక్తి దుబాయ్‌లో భాంగ్రాక్లాసులు
అమెరికాలోని నడివీధిలో ఓ వ్యక్తి ట్రాఫిక్ ఆపేసి హల్‌చల్ చేశాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. హార్డీసింగ్ అనే వ్యక్తి దుబాయ్‌లో భాంగ్రాక్లాసులు చెబుతుంటాడు. తాజాగా న్యూయార్క్ టైం స్క్వేర్‌లో పంజాబీ పాటకు డ్యాన్స్ చేస్తూ తెగ సందడి చేశాడు. అమెరికాలోని ప్రముఖ ప్రాంతం న్యూయార్క్ టైం స్క్వేర్ ప్రాంతంలో ఈ భాంగ్రా డ్యాన్సర్ తన అద్భుతమైన డ్యాన్స్‌తో స్థానికులు, నెటిజన్లను ఔరా అనిపించాడు. ఆ తర్వాత ఈ వీడియోను తన ఇస్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశాడు..దాంతో వీడియో కాస్త వైరల్ అవుతోంది.‘నా బకెట్ లిస్టులో ఈ టిక్ కొట్టేస్తున్నా. టైం స్క్వేర్‌లో డ్యాన్స్ చేశా. ట్రాఫిక్ ఆపేసి రోడ్డు మధ్యలో డ్యాన్స్ చేశా. పర్ఫెక్ట్ షాట్ కోసం గంట సేపు వెయిట్ చేశాం. ఆన్ ది స్పాట్ కొరియో ఇదంతా’ అంటూ క్యాప్షన్ పెట్టాడు. ఈ వీడియోను వీక్షించిన లక్షలమంది నెటిజన్లు డాన్స్ చాలా చక్కగా డ్యాన్స్ చేశారంటూ ప్రశంసించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..
Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

