Inspiring Video: ఊతకర్రతో బాలిక పరుగు పందెం.. డిప్యూటీ కలెక్టర్ మనసు దోచేసిన చిన్నారి..

Inspiring Video: ఊతకర్రతో బాలిక పరుగు పందెం.. డిప్యూటీ కలెక్టర్ మనసు దోచేసిన చిన్నారి..

Anil kumar poka

|

Updated on: May 10, 2022 | 9:21 AM

కృషి పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏదీ ఉండదంటారు. అవును, లోకంలో చాలా మంది తమ బలహీనతలను తమ బలంగా చేసుకొని ఔరా అనిపించేలా ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది.


కృషి పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏదీ ఉండదంటారు. అవును, లోకంలో చాలా మంది తమ బలహీనతలను తమ బలంగా చేసుకొని ఔరా అనిపించేలా ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో.. ఓ చిన్నారి బాలిక పరుగు పందెంలో పాల్గొంది. అందులో తన ప్రత్యర్థుల మధ్య క్రచెస్ సహాయంతో పరుగెత్తుతున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోను జార్ఖండ్ డిప్యూటీ కలెక్టర్ షేర్ చేశారు. ‘ఓడిపోయినా నువ్వు ప్రతి ఒక్కరినీ గెలిచావు, బిడ్డా అంటూ కామెంట్ చేశారు. ఈ వీడియోను చూస్తే మీరు కూడా ఆ చిన్నారి ఆత్మస్తైర్యానికి సెల్యూట్‌ చేయకుండా ఉండలేరు.ఈ వీడియో ఎప్పుడు ఎక్కడ తీశారో తెలియదు. కానీ ఈ వీడియో ఇంటర్నెట్ ప్రజల హృదయాలను గెలుచుకుంది. ఇందులో రేస్ టు రేస్ ట్రాక్‌లో కొందరు బాలికలు పాల్గొన్నారు. అందులో ఒక బాలికకు ఒక కాలు మాత్రమే ఉంది. ఆమె ఊతకర్ర సాయంతో నిలబడి ఉంది. పరుగెత్తడానికి విజిల్ వేయగానే, పిల్లలు పరిగెత్తారు. మిగిలిన అమ్మాయిలు తమ గమ్యస్థానానికి పరుగులు తీస్తుండగా.. ఊతకర్రల సాయంతో పరుగెత్తే బాలిక మాత్రం పట్టు వదలకుండా ఫినిషింగ్ లైన్‌ను తాకే వరకు పరుగెత్తుతూనే ఉంది. ఈ వీడియోను జార్ఖండ్‌లోని రాంచీ డిప్యూటీ కలెక్టర్ సంజయ్ కుమార్ తన ట్విట్టర్ లో షేర్ చేశారు. నాకు పదాలు దొరకడం లేదు.. ఓడిపోయి కూడా నువ్వు అందరి హృదయాలను గెలుచుకున్నావు బిడ్డా అంటూ రాసుకొచ్చారు. ఆమె ఆత్మస్థైర్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Funny Video: అది లెక్క..! నిజంగా వేడు మగాడ్రా బుజ్జి.. అభినవ పరమానందయ్య శిష్యుడు..! చూస్తే పొట్టచెక్కలే..

Funny Viral video: సమ్మర్‌లో సూపర్‌ టెక్నిక్‌.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేక గాల్లో తేలిపోతారు..!

Viral Video: ఎందుకో అంత తొందర.. పెళ్లి మండపం వరకు ఆగలేక విమానంలో పెళ్లి ఆ తరువాత…

Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..

Published on: May 10, 2022 09:21 AM