woman cat Marriage: పిల్లిని పెళ్లి చేసుకున్న మహిళ.. ఎందుకంటే ఆ కంఫర్ట్ వేరే అంటూ..
చాలామంది కుక్కలు, పిల్లులను ఎంతో ప్రేమగా పెంచుకుంటారు. వాటిని తమ కుటుంబ సభ్యుల్లా భావిస్తూ వారు ఎక్కడి వెళ్లినా వెంట తీసుకెళ్తుంటారు. వాటితో ఆడుతూ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఇక్కడ ఓ మహిళ తన పెంపుడు పిల్లిపై ప్రేమతో ఏకంగా దాన్ని పెళ్లి చేసేసుకుంది.
చాలామంది కుక్కలు, పిల్లులను ఎంతో ప్రేమగా పెంచుకుంటారు. వాటిని తమ కుటుంబ సభ్యుల్లా భావిస్తూ వారు ఎక్కడి వెళ్లినా వెంట తీసుకెళ్తుంటారు. వాటితో ఆడుతూ ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఇక్కడ ఓ మహిళ తన పెంపుడు పిల్లిపై ప్రేమతో ఏకంగా దాన్ని పెళ్లి చేసేసుకుంది. నిజమండీబాబు… లండన్‌కు చెందిన 49 ఏళ్ల డెబోరా హాడ్జ్ అనే మహిళ ఒక పిల్లిని పెంచుకుంటోంది. ఆ పిల్లి పేరు ఇండియా. అయితే లండన్‌లోని కొన్ని ఇళ్లలో పెంపుడు జంతువులను అనుమతించరు. ఎవరైనా అద్దె ఇంటిలో ఉండేవాళ్లు తమకు పెంపుడు జంతువులు ఉంటే.. వాటిని వదిలేసుకోవల్సిందే. లేదంటే వాళ్లకు అక్కడ అద్దె ఇల్లు దొరకడం చాలా కష్టం.. ఈ నిబంధనలు తనకు అస్సలు నచ్చలేదంటోంది ఈ మహిళ.అంతకుముందు కూడా ఇలాంటి నిబంధనల వల్ల చాలాసార్లు తన పెంపుడు జంతువులను వదిలేసుకున్నానని, తన ఇండియా విషయంలో అలా అస్సలు చేయనని తెగేసి చెప్తోంది. అందుకే ఆగ్నేయ లండన్‌లోని ఒక పార్కులో తన పిల్లి పిల్లను పెళ్లి చేసుకుంది. ‘‘ఇండియాను పెళ్లి చేసుకోవడం ద్వారా తాను, తన ఇద్దరు పిల్లలు, అంతా కలిసి ఒక ప్యాకేజిగా వస్తామని, కనుక మమ్మల్ని విడదీయడం కుదరదని చెబుతోంది. తనకి తన పిల్లలు ఎంత ముఖ్యమో ఇండియా కూడా నాకు అంతే ముఖ్యం’’అంటోది. తన పిల్లి పిల్లకు దూరం కావడం కంటే రోడ్డు మీద బతకడానికే తాను ఇష్టపడతానని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ మహిళ చేసిన పని నెట్టింట వైరల్‌గా మారింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Funny Video: అది లెక్క..! నిజంగా వేడు మగాడ్రా బుజ్జి.. అభినవ పరమానందయ్య శిష్యుడు..! చూస్తే పొట్టచెక్కలే..
Funny Viral video: సమ్మర్‌లో సూపర్ టెక్నిక్.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేక గాల్లో తేలిపోతారు..!
Viral Video: ఎందుకో అంత తొందర.. పెళ్లి మండపం వరకు ఆగలేక విమానంలో పెళ్లి ఆ తరువాత…
Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..