Viral Video: పెళ్లాం తిడితే హెర్డింగ్ ఎక్కేశాడు..! మద్యం మత్తులో టవర్ ఎక్కి తాగుబోతు వీరంగం..
హైదరాబాద్ మహానగరంలో ఓ భార్య బాధితుడు హల్‌చల్ చేశాడు. భార్య తిట్టిందని మద్యం మత్తులో యువకుడు అర్థరాత్రి హోర్డింగ్ టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన నర్సింగ్ రావు మద్యం మత్తులో ఫ్లెక్సీ కోసం
హైదరాబాద్ మహానగరంలో ఓ భార్య బాధితుడు హల్‌చల్ చేశాడు. భార్య తిట్టిందని మద్యం మత్తులో యువకుడు అర్థరాత్రి హోర్డింగ్ టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన నర్సింగ్ రావు మద్యం మత్తులో ఫ్లెక్సీ కోసం ఏర్పాటు చేసిన టవర్ ఎక్కి స్థానికులను భయాందోళనలకు గురి చేశాడు. నర్సింగ్ గతంలో రెండు పర్యాయాలు టవర్ ఎక్కి హంగామా సృష్టించాడు. తాజాగా రాత్రి 11 గంటల ప్రాంతంలో టవర్ ఎక్కి మరోసారి పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు. మద్యం మత్తులో దూకుతా అంటూ బెదిరించాడు నర్సింగ్ రావు. అర్థగంట పాటు హంగామా చేశాడు. సికింద్రాబాద్ ఇస్కాన్ టెంపుల్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తాగుబోతును పోలీసులు కిందకు దింపేందుకు నానా అగచాట్లు పాడాల్సి వచ్చింది. చివరికి ఎలాగోలా బుజ్జగించి సురక్షితంగా కిందకు దించిన పోలీసులు స్టేషన్‌కు తరలించారు. గతంలో ఉద్యోగం కావాలని భార్య తిట్టి.. పుట్టింటికి వెళ్లి పోయిందంటూ టవర్ ఎక్కిన నర్సింగ్ నానా హంగామా సృష్టించాడు. చివరికి కుటుంబసభ్యులు సర్ధిచెప్పడంతో దిగివచ్చాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Funny Video: అది లెక్క..! నిజంగా వేడు మగాడ్రా బుజ్జి.. అభినవ పరమానందయ్య శిష్యుడు..! చూస్తే పొట్టచెక్కలే..
Funny Viral video: సమ్మర్‌లో సూపర్ టెక్నిక్.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేక గాల్లో తేలిపోతారు..!
Viral Video: ఎందుకో అంత తొందర.. పెళ్లి మండపం వరకు ఆగలేక విమానంలో పెళ్లి ఆ తరువాత…
Tigers Video: ప్రేమ యవ్వారం ముదిరితే ఇంతే.. ఆడ పులి కోసం బీభత్సంగా పోట్లాడుకున్న రెండు మగ పులులు..