Viral: పందెం కాసి.. 10 నిమిషాల్లో లీటర్ మద్యం తాగాడు. రూ.2.31 లక్షల కోసం ఆశపడి..
సాధారణంగా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కార్యాలయాల్లో పార్టీలు చేసుకుంటుంటారు. తాజాగా చైనాలోని ఓ కంపెనీకి చెందిన ఉద్యోగులు కూడా అలాగే పార్టీ చేసుకున్నారు. ఆ పార్టీలో మద్యం తాగే ముందు కంపెనీ బాస్, ఉద్యోగుల మధ్య పందెం ప్రస్తావన వచ్చింది. బాస్ యాంగ్ ఉద్యోగులతో పందెం కాసాడు. ఒక లీటర్ మద్యం 10 నిమిషాల్లో తాగిన వారికి రూ.5 వేల యువాన్‌లు అంటే రూ.58 వేలు బహుమతిగా ఇస్తానని ఆఫర్ చేశాడు.
సాధారణంగా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కార్యాలయాల్లో పార్టీలు చేసుకుంటుంటారు. తాజాగా చైనాలోని ఓ కంపెనీకి చెందిన ఉద్యోగులు కూడా అలాగే పార్టీ చేసుకున్నారు. ఆ పార్టీలో మద్యం తాగే ముందు కంపెనీ బాస్, ఉద్యోగుల మధ్య పందెం ప్రస్తావన వచ్చింది. బాస్ యాంగ్ ఉద్యోగులతో పందెం కాసాడు. ఒక లీటర్ మద్యం 10 నిమిషాల్లో తాగిన వారికి రూ.5 వేల యువాన్‌లు అంటే రూ.58 వేలు బహుమతిగా ఇస్తానని ఆఫర్ చేశాడు. కానీ ఎవరూ స్పందించలేదు. దాంతో రూ.10 వేల యువాన్‌లు రూ.1.15 లక్షలు ఇస్తానని ప్రకటించాడు. అయినా ఎవరూ రెస్పాండ్ కాలేదు. దాంతో బాస్ యాంగ్ ఏకంగా రూ. 20 వేల యువాన్‌లు (సుమారు రూ.2.31 లక్షలు) ఆఫర్ చేశాడు. దాంతో ఝాంగ్ అనే ఉద్యోగి బాస్ కాసిన పందేనికి సై అన్నాడు. లీటర్ మద్యం బాటిల్ సీల్ తీసి గుటగుటమని 10 నిమిషాల్లోపే తాగేశాడు. కానీ మద్యం తాగిన వెంటనే ఝాంగ్ స్పృహతప్పి పడిపోయాడు. సహోద్యోగులు వెంటనే ఆస్పత్రికి తరలించగా పరిశీలించిన వైద్యులు అతను అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. అతిగా మద్యం తీసుకోవడం వల్ల ఆల్కహాల్ పాయిజనింగ్, ఆస్పిరేషన్ నిమోనియా, ఊపిరాడకపోవడం, కార్డియాక్ అరెస్ట్ లాంటి కారణాలతో అతను మరణించి ఉంటాడని వైద్యులు చెప్పారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..