ఒంటరితనం భారమై.. బాత్రూం పాలైన వృద్ధుడు
పేదరికమే శాపం అయింది. ఒంటరితనం భారమైంది. దీంతో బతుకు బాత్రూం పాలయ్యింది. నిరక్షరాస్యత ఓవైపు.. సమస్యలు చెప్పుకోలేని అమాయకత్వం మరోవైపు.. ఎప్పుడో 20 ఏళ్ల కిందట నిర్మించిన చిన్నఇల్లు. కొద్దిపాటి వర్షాలకే పై నుండి వర్షపు నీరు కురుస్తుండటంతో.. ఆ ఇంట్లో నివసించలేక ఓ గిరిజన వృద్ధుడు బాత్రూం గదినే నివాస గృహంగా మార్చుకున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గురువాయిగూడెం గ్రామంలో పద్ధం భద్రయ్య అనే వృద్ధుడు బాత్రూంనే తన నివాసంగా చేసుకొని బతుకును సాగదీస్తున్నాడు
పేదరికమే శాపం అయింది. ఒంటరితనం భారమైంది. దీంతో బతుకు బాత్రూం పాలయ్యింది. నిరక్షరాస్యత ఓవైపు.. సమస్యలు చెప్పుకోలేని అమాయకత్వం మరోవైపు.. ఎప్పుడో 20 ఏళ్ల కిందట నిర్మించిన చిన్నఇల్లు. కొద్దిపాటి వర్షాలకే పై నుండి వర్షపు నీరు కురుస్తుండటంతో.. ఆ ఇంట్లో నివసించలేక ఓ గిరిజన వృద్ధుడు బాత్రూం గదినే నివాస గృహంగా మార్చుకున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గురువాయిగూడెం గ్రామంలో పద్ధం భద్రయ్య అనే వృద్ధుడు బాత్రూంనే తన నివాసంగా చేసుకొని బతుకును సాగదీస్తున్నాడు. బాత్రూం గదిలోనే చిన్న కట్టెల పొయ్యి ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పక్కనే పడక మంచంపై సేదతీరుతున్నాడు. సంతానం లేదు. ఉన్న ఒక్క వికలాంగురాలైన భార్య మరణించడంతో ఒంటరిగా బతుకు భారంగా కాలం వెళ్ళదీస్తున్నాడు. పక్కా ఇంటి నిర్మాణం కోసం బెడ్ రూమ్ ఇల్లు కానీ గృహలక్ష్మి పథకం గానీ తనకు వర్తించవన్న అధికారుల సమాధానమిస్తున్నారని గోడు వెళ్ళబోసుకున్నాడు. ఇంటికోసం దరఖాస్తు చేసుకుంటే.. తనకి స్లాబుతో కూడిన ఇల్లు ఉందని అధికారులు సమాధానం ఇస్తున్నారన్నాడు. దీంతో తనకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కానీ గృహలక్ష్మి పథకం గాని వర్తించవని అధికారులు ముప్పు తిప్పలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు భద్రయ్య.