David Warner Dance: సల్మాన్‌ఖాన్‌లా మారిన వార్నర్‌.. దిశాపటానీతో డాన్స్‌ ఇరగదీసిన డేవిడ్‌ వార్నర్‌..

David Warner Dance: సల్మాన్‌ఖాన్‌లా మారిన వార్నర్‌.. దిశాపటానీతో డాన్స్‌ ఇరగదీసిన డేవిడ్‌ వార్నర్‌..

Anil kumar poka

|

Updated on: Apr 19, 2022 | 8:19 AM

ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలుసు. ముఖ్యంగా లాక్‌డౌన్‌ సమయంలో హాయిగా కుటుంబ సభ్యులతో గడుపుతూనే టిక్‌టాక్‌ వీడియోలతో ఆకట్టుకున్నాడు.


ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలుసు. ముఖ్యంగా లాక్‌డౌన్‌ సమయంలో హాయిగా కుటుంబ సభ్యులతో గడుపుతూనే టిక్‌టాక్‌ వీడియోలతో ఆకట్టుకున్నాడు. తెలుగు, హిందీ సినిమా పాటలకు తనదైన స్టెప్పులు వేస్తూ నెట్టింట్లో నయా క్రేజ్‌ తెచ్చుకున్నాడు. ముఖ్యంగా మార్ఫ్‌డ్‌ ఫేస్ యాప్ తో ఫేమస్ తెలుగు, హిందీ సినిమాల్లో హీరోల ముఖాన్ని తీసేసి.. అందులో తన ముఖాన్ని అతికించి.. పాటలు, డైలాగులు ఇరగదీశాడు. ఇప్పుడు లేటెస్ట్ గా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ను ఇమిటేట్‌ చేశాడు ఈ స్టార్‌ క్రికెటర్‌. సల్లూభాయ్‌ నటించిన ‘రాధే: యువర్‌ మోస్ట్‌ వాంటెడ్‌ భాయ్‌’ సినిమాలోని సీటీమార్‌ సాంగ్‌కు అద్భుతంగా స్టెప్పులేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారిందిఈ వీడియోలో సల్మాన్ ఖాన్ ముఖం ఫేస్‌లో తన ముఖాన్ని మార్ఫింగ్ చేసిన వార్నర్‌ దిశా పటానీతో డ్యాన్స్ చేశాడు. అంతేకాదు ఈ సాంగ్‌లో సల్మాన్‌ చేసిన హుక్‌ స్టెప్‌ను ఒరిజినల్‌గా చేయాలనుకుంటున్నానని, త్వరలోనే కొత్త ఇన్‌స్టాగ్రామ్‌ రీల్‌తో మళ్లీ మీ ముందుకు వస్తానని ఈ వీడియోకు క్యాప్షన్‌ ఇచ్చాడు వార్నర్‌. కాగా ఈ వీడియోలో సల్మాన్ ఎక్స్ ప్రెషన్స్‌కు తగ్గట్టుగా తనదైన స్టైల్‌లో హావభావాలు ప్రదర్శించి ఆకట్టుకున్నాడు డేవిడ్‌. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. సల్మాన్ అభిమానులు వార్నర్ భాయ్.. వార్నర్ భాయ్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Elephant-Lion: అః.. కుక్క మొరిగితే కొండకు సేట.. ఏనుగుపై సింహం దాడి.. కట్‌చేస్తే.. సీన్‌ రివర్స్‌

kacha badam Singer: తత్వం బోధపడింది.. నేనేంటో తెలిసొచ్చింది.. కచ్చా బాదామ్‌ సింగర్‌ మాటలు వింటే షాక్…

Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..

Viral Video: వారేవా ఇది కదరా స్నేహమంటే.. దివ్యాంగుడిని భుజాలపై తిప్పిన గర్ల్స్‌.. వైరల్ వీడియో

Shashi Tharoor-Supriya Sule: నిండు సభలో సుప్రియతో అదేం పని శశిథరూర్‌.! వీడియో చుస్తే ఫ్యూజులు ఔట్ అంతే..

Ram Charan-Urfi Javed: రామ్ చరణ్ కు పడిపోయిన.. బాలీవుడ్ శృంగార తార.. ఓపెన్ ఆఫర్ అంటూ ఇలా..

Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..