Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: క్యూట్‌ పిల్లికి ఫిదా అయిన కొంటె కోతి.. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో..

Viral Video: మనుషులంతా ఒక్కటే అయినా ఒకరొకరి మధ్య గొడవలు జరుగుతుంటాయి. అయితే ఆలోచించే శక్తి ఉన్న మనుషులే ఇలా చేస్తే విచక్షణ లేని జంతువుల పరిస్థితి ఏంటి.? అందుకే రెండు రకాల జంతువులు ఎక్కడ కలిసినా చిన్న సైజ్‌ ఫైటింగ్‌ జరగాల్సిందే...

Viral Video: క్యూట్‌ పిల్లికి ఫిదా అయిన కొంటె కోతి.. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో..
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 27, 2022 | 12:34 PM

Viral Video: మనుషులంతా ఒక్కటే అయినా ఒకరొకరి మధ్య గొడవలు జరుగుతుంటాయి. అయితే ఆలోచించే శక్తి ఉన్న మనుషులే ఇలా చేస్తే విచక్షణ లేని జంతువుల పరిస్థితి ఏంటి.? అందుకే రెండు రకాల జంతువులు ఎక్కడ కలిసినా చిన్న సైజ్‌ ఫైటింగ్‌ జరగాల్సిందే. ఆహారం కోసమో, ఆత్మరక్షణ కోసమో ఒక జంతువుపై మరొకటి దాడి చేసుకోవడం చూస్తూనే ఉంటాం. అయితే దీనికి భిన్నంగా రెండు విభిన్న జాతులకు చెందిన జంతువులు మంచి స్నేహితులుగా మారితే ఎలా ఉంటుంది.? తాజాగా ఇలాంటి ఓ వీడియోనే నెట్టింట వైరల్‌ అవుతోంది.

సాధారణంగా పిల్లి, కోతి ఎదురు పడితే ఏం చేస్తాయి.? ఒకదానిపై ఒకటి దాడి చేసుకుంటాయి కదూ! కానీ ఓ కోతి మాత్రం దీనికి భిన్నంగా స్పందించింది. వివరాల్లోకి వెళితే.. ఓ ఫ్యామిలీ తమ పెంపుడు పిల్లిని తీసుకొని వెకేషన్‌కు వెళ్లింది. అదే సమయంలో రోడ్డు పక్కన్న వారికి ఓ కోతుల గుంపు కనిపించింది. వెంటనే రోడ్డు పక్కన ఆగి ఆ కోతులను చూస్తున్నారు. ఇదే సమయంలో ఆ గుంపులో నుంచి ఓ కోతి, సదరు పిల్లికి వద్దకు వచ్చింది. అంతటితో ఆగకుండా పిల్లిని ముద్దాడింది.

అసలే పెంపుడు పిల్లి, అందులోనూ దాని యజమానులు అందంగా రడీ చేశారు. దీంతో ముద్దుగా అనిపించిందో ఏమో కానీ.. ముద్దుచేయడానికి ట్రై చేసింది కోతి. అనంతరం అక్కడి నుంచి వెళ్లి పోయింది. దీనంతటినీ స్మార్ట్‌ ఫోన్‌లో బంధించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లను ఫిదా అవుతున్నారు.

Also Read: Happy Birthday Ram Charan: నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న చెర్రీ.. మంచి నటుడే కాదు మంచి జంతు ప్రేమికుడు

APSRTC: నష్టాల ఊబి నుంచి బయటపడేందుకు ఆర్టీసీ సన్నాహాలు.. గ్యారేజీలు, డిపోల్లో ఆ సేవలు

Bandla Ganesh: ఉత్తరప్రదేశ్ సీఎంతో బండ్ల గణేష్ మంతనాలు.. నువ్వు సూపరన్న అంటున్న నెటిజన్ల