Cow Swayamvar: గోమాతకు స్వయంవరం.. పాల్గొన్న 12 జాతుల ఆంబోతులు. వైరల్ వీడియో.
ఇదేంటి గోవుకు స్వయంవరం అనుకుంటున్నారా? మీరు చదివింది నిజమే. కాకినాడజిల్లాకు చెందిన డాక్టర్ గౌరీ శేఖర్ అనే వ్యక్తి తన ఇంట పెంచుకుంటున్న పుంగనూరు ఆవుకు స్వయంవరం ప్రకటించారు. ఈ స్వయం వరానికి వివిధ జాతులకు చెందిన 12 ఆంబోతులను వెంటపెట్టుకొని వాటి యజమానులు హాజరయ్యారు. పూర్వకాలంలో రాజులు తమ కుమార్తెలకు స్వయంవరం ప్రటించేవారు.
ఇదేంటి గోవుకు స్వయంవరం అనుకుంటున్నారా? మీరు చదివింది నిజమే. కాకినాడజిల్లాకు చెందిన డాక్టర్ గౌరీ శేఖర్ అనే వ్యక్తి తన ఇంట పెంచుకుంటున్న పుంగనూరు ఆవుకు స్వయంవరం ప్రకటించారు. ఈ స్వయం వరానికి వివిధ జాతులకు చెందిన 12 ఆంబోతులను వెంటపెట్టుకొని వాటి యజమానులు హాజరయ్యారు. పూర్వకాలంలో రాజులు తమ కుమార్తెలకు స్వయంవరం ప్రటించేవారు. అందులో యువరాణి తనకు నచ్చిన యువరాజు మెడలో వరమాల వేసి తన అభిప్రాయాన్ని తెలియగా.. అనంతరం వారిరువురికి వివాహం చేసేవారు. అదేవిధంగా గౌరీ శేఖర్ తన ఆవుకోసం స్వయంవరం ప్రకటించటం అందరినీ అందరికీన ఆకట్టుకుంది. తమ తమ ఇంట పెంచుకుంటున్న ఆంబోతులను చక్కగా ముస్తాబు చేసి స్వయంవరానికి తరలివచ్చారు. గౌరీశేఖర్ తమ గోమాతను సుందరంగా ముస్తాబుచేసి తనకు నచ్చిన వృషభాన్ని ఎన్నుకోడానికి వాటి సమక్షంలోకి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్వవిద్యా ఆథ్యాత్మిక పీఠం పీఠాథిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా హాజరయ్యారు. కాశీకి చెందిన వేదపండితుల సమక్షంలో కళ్యాణమండపంలో ఈ స్వయం వరం కన్నులపండువగా సరికొత్త సంప్రదాయంగా జరిగింది. స్వయం వరం ముగిసిన అనంతరం గోవుకు, వృషభానికి వివాహం జరిపించారు. అనంతరం బంధుమిత్రులందరికీ విందు భోజనాలు వడ్డించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..