Rare Fish: వామ్మో.. చేప తెచ్చిన తంటా.. యుద్ధం చేసినంత పనైందే..! వీడియో.
విజయనగరం జిల్లాలో ఓ రైతుకు వింత అనుభవం ఎదురైంది. సంతకవిటి మండలం శ్రీహరినాయుడు పేట సమీపంలో ఓ రైతు ఉదయాన్నే పొలం పనులకు వెళ్లాడు. అలా పొలం వెళ్లిన రైతు పొలంలో పనులు చేస్తుండగా మడ్డువలస రిజర్వాయర్ నుండి పొలంలోకి వస్తున్న నీటిలో ఓ పొడవాటి అరుదైన ప్రాణి వేగంగా ప్రాకుతూ వచ్చింది. ఆ ప్రాణిని చూసిన రైతు ఏదో ప్రమాదకరమైనదనుకొని భయంతో పరుగులు తీశాడు.
విజయనగరం జిల్లాలో ఓ రైతుకు వింత అనుభవం ఎదురైంది. సంతకవిటి మండలం శ్రీహరినాయుడు పేట సమీపంలో ఓ రైతు ఉదయాన్నే పొలం పనులకు వెళ్లాడు. అలా పొలం వెళ్లిన రైతు పొలంలో పనులు చేస్తుండగా మడ్డువలస రిజర్వాయర్ నుండి పొలంలోకి వస్తున్న నీటిలో ఓ పొడవాటి అరుదైన ప్రాణి వేగంగా ప్రాకుతూ వచ్చింది. ఆ ప్రాణిని చూసిన రైతు ఏదో ప్రమాదకరమైనదనుకొని భయంతో పరుగులు తీశాడు. కొంతసేపు టెన్సన్‌తో అటూ ఇటూ తిరిగి.. ప్రక్క పొలాల్లోని రైతులను పిలిచాడు. దీంతో పరుగు పరుగున అక్కడికి చేరిన రైతులు.. దాన్ని అరుదైన జాతి పాముగా నిర్ణయానికి వచ్చారు. దీంతో కర్రలతో ఆ ప్రాణిని కొట్టి చంపారు. నెమ్మదిగా దాన్ని పరిశీలించగా.. అక్కడ కనిపిస్తుంది పాము కాదని, అరుదైన చేప అని తేల్చేశారు. ఆ చేప సుమారు ఐదు అడుగుల పొడవు, ఇరవై ఆరు కేజీల బరువు ఉంది. అంతవరకు బాగానే ఉన్నా.. సదరు రైతుకు అసలు సమస్య అప్పుడు మొదలైంది. రైతు చేతికి దొరికిన చేపను తాము కూడా చూశామని, అందరికి ఆ చేపలో వాటా ఉంటుందని మిగిలిన రైతులు గొడవకు దిగారు. గొడవ ముదిరి ఆ పంచాయితీ కాస్తా గ్రామంలోని పెద్ద మనుషుల వద్దకు చేరింది. దీంతో ఇరు వర్గాల వాదనలు విని ఎట్టకేలకు చేప రైతు పొలంలో దొరికింది కాబట్టి రైతుకు చెందిందని తీర్పు ఇచ్చారు గ్రామపెద్దలు. హమ్మయ్య నా చేప నాకు దక్కింది అని సంబరపడుతూ చేపను తీసుకొని ఇంటికి వెళ్ళాడు రైతు. ఇదంతా ఒక ఎత్తైతే చేపతో ఇంటికి చేరిన రైతుకి మరో తంటా వచ్చి పడింది. అరుదైన చేప విషపూరితం అయ్యిందని అనుమానాలు వ్యక్తం చేశారు గ్రామస్తులు. ఎట్టకేలకు చేప వండి పులుసు పెట్టింది రైతు భార్య. దొరికిన చేప తినడానికి రైతు యుద్దాలు చేసినంత పని అయ్యింది. ఏదో ఒకలా దొరికిన చేపపులుసు తిని జిహ్వచాపల్యం పొందాడు రైతు. అలా చేప కథ కంచికి చేరింది. చేప కోసం రైతు పడ్డ కష్టం ఇప్పుడు చుట్టుప్రక్కల గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..