అర్ధరాత్రి ఇళ్ల ప్రాంగణంలో తచ్చాడిన వింత జంతువు.. అదేమిటి అని ఆరా తీయగా
ఆదిలాబాద్ జిల్లాలో పలు ప్రాంతాల్లో సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న వింత జంతువు ఎట్టకేలకు చిక్కింది. ఇంద్రవెల్లి మండల కేంద్రంలో నెల రోజులుగా సంచరిస్తున్న వింత జంతువును స్థానికులు పట్టుకున్నారు. అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఇళ్లలో తచ్చాడుతున్న వింత జంతువును వల సాయంతో బంధించారు స్థానికులు.
అనంతరం అటవిశాఖ అధికారులకు అప్పగించారు. ఓ ఇంటి ముందు ఉన్న సిసి ఫుటేజ్ లో జంతువు సంచారాన్ని గమనించిన పలువురు.. అది మర్నాగి అని కొందరు, అడవి ముంగిసా అని మరికొందరు భావించారు. వింత జంతువు సంచారంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు స్థానికులు. అయితే అటవిశాఖ అధికారులు ఆ జంతువును పునుగు పిల్లిగా గుర్తించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తిరుమల అడవుల్లో సంచరించే పునుగు పిల్లి ఇంద్రవెల్లి లో ప్రత్యక్షమవడంపై అందరూ హర్షం వ్యక్తం చేశారు. ఇంద్రవెళ్లి మండలంలో ఆదివారం అర్థరాత్రి 9 గంటల ప్రాంతంలో రాంనగర్ కాలనీలోని ముండే లక్ష్మణ్ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఈ జంతువు కనిపించింది. దీనిని గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. మాజీ సర్పంచ్ సుంకట్ రావ్ పంచాయతీ సిబ్బందితో కలిసి వల వేసి ఈ జంతువును బంధించారు. స్థానిక యువకులు ఆ జంతువును చాకచక్యంగా పట్టుకొని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో పులిమడుగు సెక్షన్ అధికారి ఎం.చంద్రారెడ్డి, అటవీశాఖ సిబ్బంది సంజివ్ లు ఆ జంతువును స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రూ.2,500 కోట్ల ఆస్తికి వారసుడు.. కానీ పాపం
ఉదయాన్నే బ్లాక్ కాఫీ తాగితే ఇన్ని ప్రయోజనాలా
చియా సీడ్స్ తీసుకుంటున్నారా.. జాగ్రత్త.. ఇలా చేశారంటే
దక్షిణాదికి అత్యున్నత గౌరవం.. సౌత్ దశ తిరిగిందా
TOP 9 ET News: OTTకి పుష్ప2..ఆడియన్స్‌కు షాకిచ్చిన నెట్‌ఫ్లిక్స్ | పాపం! రవితేజ బాలయ్యకే ఆ ఛాన్స్