తేనె కళ్ల మోనాలిసా హోం టూర్.. వీడియో
ఉత్తరప్రదేశ్‌లోని మహాకుంభమేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. మహా కుంభమేళాలో పూసల దండలు అమ్ముకునే ఒక సాధారణ అమ్మాయి మోనాలిసా సోషల్ మీడియా స్టార్‌గా మారిపోయింది. ఆమెకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. కుంభమేళాకు వచ్చిన వారిని తన అందమైన కళ్లతో కట్టిపడేసిన మోనాలిసా తాజాగా మరో వీడియోను విడుదల చేసింది. అందులో తాను ఎక్కడ నివసిస్తున్నానో, తాముంటున్న ఇల్లు ఎలా ఉందో చూపించింది. ఇటీవలి కాలంలో మోనాలిసాతో ఇంటర్వ్యూ తీసుకోవడానికి యూట్యూబర్లు ఆమె వెంటపడుతున్నారు.
కొందరు ఆమెతో ఫోటోలు దిగాలని, మరికొందరు వీడియోలు తీయాలని తాపత్రయపడుతున్నారు. అకస్మాత్తుగా వచ్చిన సోషల్ మీడియా పాపులారిటీతో ఇక్కట్ల పాలైన మోనాలిసా ప్రయాగ్‌రాజ్‌ను వీడినా ఆమెకు మనశ్శాంతి మాత్రం కరువైంది. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేశారంటూ ఎక్స్ వేదికగా వెల్లడించింది. ప్రస్తుతం తనకు ఏం చేయాలో పాలుపోవట్లేదని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా తన పట్ల చూపించిన ప్రేమ, అభిమానాలకు ధన్యవాదాలు తెలిపింది ఈ కాటుక కళ్ల చిన్నది. తన ఇంటిని చూపిస్తూ తాజాగా ఈ అందాల ముద్దుగుమ్మ ఓ వీడియో చేయగా.. ప్రజెంట్ నెట్టింట్లో ఆ వీడియో వైరల్ గా మారింది.
వైరల్ వీడియోలు
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్
