అంతరిక్షం నుంచి కుంభమేళాను చూశారా..!వీడియో
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో వైభవోపేతంగా జరుగుతోంది. ఈ అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రపంచ దేశాల నుంచి భక్తులు, పర్యాటకులు తరలివస్తున్నారు. అంతరిక్షం నుంచి తీసిన కుంభమేళాకు సంబంధించిన దృశ్యాలను నాసా వ్యోమగామి డోనాల్డ్ పెటిట్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న నాసా వ్యోమగామి డోనాల్డ్ పెటిట్ అక్కడినుంచి కనిపిస్తున్న కుంభమేళా దృశ్యాలను క్లిక్ మనిపించారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మహాకుంభమేళా సందర్భంగా గంగా నది వద్ద జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం వెలుగులీనుతోంది అంటూ రాసుకొచ్చారు. ఈ చిత్రాలను చూసిన నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా… అంతరిక్ష కేంద్రం నుంచి చాలా అద్భుతంగా కనిపిస్తోంది. ఈ ఆధ్యాత్మక కార్యక్రమం తన వైభవాన్ని ఈ విధంగా ప్రపంచానికి చాటి చెబుతోంది’’ అని ఓ నెటిజన్ అన్నారు.
వైరల్ వీడియోలు

పాపం.. వృద్ధురాలి ప్రాణం తీసిన మస్కిటో కాయిల్..

అది.. వర్క్ ఫ్రమ్ హోమ్.. వర్క్ ఫ్రమ్ కారు కాదమ్మా

కానుకలు నచ్చలేదన్న వరుడు.. పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు

ఇదేం పిల్లి మావా.. ఏకంగా విమానాన్నే ఆపేసింది..

భర్తకు భార్య ఇచ్చిన వెరైటీ వాలంటైన్ డే గిఫ్ట్..

పాము కాటు వేసేటప్పుడు.. విషాన్ని ఎలా వదులుతుందో తెలుసా?

అయ్యబాబోయ్.. ఈ వీడియో చూస్తే మతి పోతుంది
