China: చైనా వ్యోమగాముల రికార్డు.. ఆరున్నర గంటల్లో స్పేస్‌ స్టేషన్‌కు చేరిక.

China: చైనా వ్యోమగాముల రికార్డు.. ఆరున్నర గంటల్లో స్పేస్‌ స్టేషన్‌కు చేరిక.

Anil kumar poka

|

Updated on: Oct 28, 2023 | 9:28 PM

చైనాకు చెందిన 38 ఏళ్ల పిన్న వయస్కులైన వ్యోమగాములు రికార్డు సృష్టించారు. అంతరిక్ష నౌకను ప్రయోగించిన ఆరున్నర గంటల్లోనే ఆ దేశానికి చెందిన అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. ముగ్గురు చైనీస్ వ్యోమగాములతో షెంజౌ-17 అంతరిక్ష నౌకను జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి గురువారం లాంచ్‌ చేశారు. అనంతరం 6.5 గంటల్లోనే టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రం ఫార్వర్డ్ పోర్ట్‌కు ఆ స్పేస్‌క్రాఫ్ట్‌ విజయవంతంగా డాక్ అయ్యింది.

చైనాకు చెందిన 38 ఏళ్ల పిన్న వయస్కులైన వ్యోమగాములు రికార్డు సృష్టించారు. అంతరిక్ష నౌకను ప్రయోగించిన ఆరున్నర గంటల్లోనే ఆ దేశానికి చెందిన అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. ముగ్గురు చైనీస్ వ్యోమగాములతో షెంజౌ-17 అంతరిక్ష నౌకను జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి గురువారం లాంచ్‌ చేశారు. అనంతరం 6.5 గంటల్లోనే టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రం ఫార్వర్డ్ పోర్ట్‌కు ఆ స్పేస్‌క్రాఫ్ట్‌ విజయవంతంగా డాక్ అయ్యింది. ఆ దేశ అంతరిక్ష ప్రయోగ సెంటర్‌ కమాండర్‌ ఈ విషయాన్ని తెలిపారు. వేగంగా నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రానికి ఆరోసారి వ్యోమగాములను చైనా పంపింది. అయితే ఈసారి అతి పిన్న వయస్కులైన వ్యోమగాములను అంతరిక్ష కేంద్రానికి పంపడం 12వ మిషన్ ప్రత్యేకత. అక్కడకు చేరుకున్న ముగ్గురు మగ వ్యోమగాముల సగటు వయస్సు 38 ఏళ్లు. సుమారు ఆరు నెలలపాటు టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రంలో పరిశోధనలు చేస్తారు. ఈ ఏడాది మే నుంచి టియాంగాంగ్ స్పేస్ స్టేషన్‌లో ఉన్న షెన్‌జౌ-16 క్రూ సిబ్బంది స్థానాన్ని షెన్‌జౌ-17 వ్యోమగాములు భర్తీ చేస్తారు. షెన్‌జౌ-16 క్రూ సిబ్బంది అక్టోబర్ 31న భూమికి తిరిగి చేరుకుంటారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..