Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

China Military: ఏడేళ్ల పిల్లలకు సైనిక శిక్షణ.! చైనా కఠిన నిర్ణయం.! ఎందుకంటే..?

China Military: ఏడేళ్ల పిల్లలకు సైనిక శిక్షణ.! చైనా కఠిన నిర్ణయం.! ఎందుకంటే..?

Anil kumar poka

|

Updated on: Dec 01, 2023 | 3:35 PM

క్రమశిక్షణ, నిబంధనల పేరిట చైనా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి వెనకాడదు. తాజాగా ఏడేళ్ల పిల్లలకు కూడా సైనిక శిక్షణ ఇస్తోంది. క్రమశిక్షణ, పోరాట సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఏడేళ్ల వయసు నుంచి 25 ఏళ్ల లోపు యువకులకు కొద్దిరోజుల పాటు ఈ కఠిన శిక్షణ అందిస్తోంది . ఈ మేరకు షాంఘై క్రీడల విభాగం నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా చైనా మిలిటరీ పోరాట స్ఫూర్తి, ప్రమాణాలను పిల్లలు, యువత పూర్తిగా అర్థం చేసుకుంటారని తెలిపింది.

క్రమశిక్షణ, నిబంధనల పేరిట చైనా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి వెనకాడదు. తాజాగా ఏడేళ్ల పిల్లలకు కూడా సైనిక శిక్షణ ఇస్తోంది. క్రమశిక్షణ, పోరాట సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఏడేళ్ల వయసు నుంచి 25 ఏళ్ల లోపు యువకులకు కొద్దిరోజుల పాటు ఈ కఠిన శిక్షణ అందిస్తోంది . ఈ మేరకు షాంఘై క్రీడల విభాగం నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా చైనా మిలిటరీ పోరాట స్ఫూర్తి, ప్రమాణాలను పిల్లలు, యువత పూర్తిగా అర్థం చేసుకుంటారని తెలిపింది. ఇది వరకు చైనా ఫుట్‌బాల్ జట్లు కూడా ఇదే తరహా శిక్షణ పొందాయి. కమ్యూనిస్టు పార్టీ విలువల విస్తృత ప్రచారంలో భాగంగానే ఈ తరహా చర్యలు తీసుకుంటారనే అభిప్రాయం ఉంది. ప్రస్తుత శిక్షణా కార్యక్రమంలో ఏడేళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య వయసు గల అథ్లెట్లు భాగమయ్యారు. షాంఘై నగరంలోని 11 కేంద్రాల్లో 932 మంది అథ్లెట్లు ట్రైనింగ్ పొందుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరూ ఈ అవకాశం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారని పురుషుల జిమ్నాస్టిక్ హెడ్ కోచ్‌ అన్నారు. జట్లు సమిష్టిగా, క్రమశిక్షణతో పనిచేసేందుకు, ఐరన్‌ ఆర్మీని సృష్టించేందుకు ఈ కార్యక్రమం ఉపకరించనుందని వార్తా కథనాలు ప్రచురించాయి. ఇదిలా ఉంటే.. వాస్తవ యుద్ధం కోసం చైనా తన సంసిద్ధతను మెరుగుపర్చుకోవాలని అధ్యక్షుడు జిన్‌పింగ్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మరోపక్క.. యువతలో దేశభక్తిని నింపేలా గత నెలలో కొత్త విద్యాచట్టాన్ని చైనా ఆమోదించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.