vairal : చిన్న పిల్లలు చేసే పనులు కొన్నిసార్లు కోపంతోపాటు నవ్వులు కూడా తెప్పిస్తుంటాయి. మనం ఎం చెయ్యద్దంటే పిల్లలు అదే చేస్తుంటారు. ఇక వాళ్ళ ఆటలు సరదాతోపాటు కొన్ని సార్లు ప్రాణాలమీదకు తీసుకువస్తుంటాయి. తాజాగా కొంత మంది చిన్న పిల్లలు చేసిన ఓ పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
చైనాలో ఫుజియాన్‌లో కొంతమంది చిన్న పిల్లలు పటాసులను పేలుస్తు సంబరపడుతున్నారు. అందులో వింతేముంది అనుకుంటున్నారా .. అంతా సమయంగా చేస్తే పిల్లలు ఎందుకు అవుతారు. ఈ చిచ్చర పిడుగులు ఆ పటాసులను ఒక మ్యాన్హోల్ లో వేసి పేల్చారు. ముగ్గురు పిల్లలు పటాసులకు నిప్పు అంటించి మ్యాన్ హోల్ లోపల పడేసారు. ఆతర్వాత దాని మూతను మూసివేశారు. లోపల ఉన్న పటాసులు ఒక్కసారిగా పేలడంతో దాని ప్రభావానికి ఓ పిల్లడు గాలిలోకి ఎగిరి పడ్డాడు. ఇప్పుడు ఏ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరా అవుతుంది.కొంతమంది ఈ వీడియో చూసి నవ్వుకుంటుంటే మరికొంత మంది మాత్రం ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేయడం ప్రాణాలకు ప్రమాదం పెద్దలే పిల్లలకు బుద్ధి చెప్పాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏమైనా పిల్లలతో జాగ్రత్త సుమీ..
మరిన్ని ఇక్కడ చదవండి :
‘దృశ్యం 2’ను వదలని పైరసీ బూతం… రిలీజ్ అయిన గంటల్లోనే తమిళ్ రాకర్స్‌లో మోహన్ లాల్ సినిమా..