Whale Flight: భాగ్యనగరానికి అరుదైన అతిథి.. గాల్లో ఎగురుకుంటూ వచ్చిన తిమింగలం..! వైరల్ వీడియో.
తిమింగలం ఏంటి.. గాల్లో ఎగురుకుంటూ రావడమేంటి అనుకుంటున్నారా.. అవును ఈ అరుదైన అతిథి దుబాయ్‌నుంచి ఎగురుకుంటూ భాగ్యనగరానికిచేరుకుంది.
తిమింగలం ఏంటి.. గాల్లో ఎగురుకుంటూ రావడమేంటి అనుకుంటున్నారా.. అవును ఈ అరుదైన అతిథి దుబాయ్‌నుంచి ఎగురుకుంటూ భాగ్యనగరానికిచేరుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానంగా గుర్తింపు పొందిన ‘ఎయిర్ బస్ బెలూగా’ లోహ విహంగం హైదరాబాదులో ల్యాండైంది. ఈ విశిష్ట అతిథికి హైదరాబాద్ ఎయిర్ పోర్టు వర్గాలు స్వాగతం పలికాయి. దుబాయిలోని అల్ మక్‌తుమ్ విమానాశ్రయం నుంచి థాయిలాండ్‌లోని పట్టాయా ఎయిర్‌పోర్టుకు వెళ్తూ మార్గంమధ్యలో ఇంధనం నింపుకోడానికి శంషాబాద్ విమానాశ్రయంలో దిగింది.ఎయిర్‌బస్ కంపెనీ సరకు రవాణా కోసం తిమింగలం ఆకారంలో ఉండే విమానాలను తయారుచేసింది. కేవలం ఐదు విమానాలను మాత్రమే తయాచు చేశారు. విమానం పొడవు 56 మీటర్లు, బరువు 95 టన్నులు. ఇది 56 అడుగుల ఎత్తు ఉంటుంది. ఎయిర్ బస్ సంస్థ దీన్ని ఒక తిమింగలం రూపంలో డిజైన్ చేసింది. ఇందులో అన్నీ ప్రత్యేకతలే. మామూలుగా అయితే అన్ని విమానాల్లోనూ లోడింగ్, అన్‌లోడింగ్ విమానం వెనుక వైపు నుంచి చేస్తారు. కానీ ఈ విమానంలో మాత్రం మాత్రం ముందు వైపునుంచే లోడింగ్ చేసే వీలుంది. లోడింగ్ సమయంలో ముందు భాగం పూర్తిగా పైకి లేస్తుంది. గతంలో ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానంగా అంటోనొవ్ ఏఎన్-225 మ్రియాకు పేరుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భాగంగా ఆ విమానాన్ని ఇటీవలే రష్యా ధ్వంసం చేసింది. దీంతో ఇప్పుడు ఇదే అతిపెద్ద కార్గో విమానంగా పేరుగాంచింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..
గ్యాస్ సెగ.. మళ్లీ లాక్డౌన్ తప్పదా
విమానంలో బీడీ తాగాడు.. కట్ చేస్తే.. ఇలా అయ్యాడు
చిలుక జోస్యం చెప్పే వ్యక్తి చేతిలో.. లక్షలు పోగొట్టుకున్న అధికారి
ఈమె అవతారం చూసి పిచ్చిది అనుకుంటున్నారా ?? కాదు గొప్ప సెలబ్రిటీ
చితి పెడదాం అని తీసుకెళ్లారు.. ఈ లోపే తిరిగి లేచాడు
కోతులకు భయం.. భక్తులకు అభయం !! హనుమంతుడి రూపంలో ఆశీస్సులు
ప్రస్తుతం బంగారం కంటే విలువైన సిలిండర్ల ట్రక్కు చోరీ

