Viral Video: ఇది కెనడా మార్క్ ‘స్ట్రీట్ ఫైట్’.. !వైరలవుతోన్న వీడియో

టొరంటోలోని ఓ మాల్ బయట జరిగిన ఓ స్ట్రీట్ ఫైట్ కు సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Viral Video: ఇది కెనడా మార్క్ స్ట్రీట్ ఫైట్.. !వైరలవుతోన్న వీడియో
Desi Street Fight Goes Viral

Updated on: Jun 29, 2021 | 1:48 PM

Viral Video: టొరంటోలోని ఓ మాల్ బయట జరిగిన ఓ స్ట్రీట్ ఫైట్ కు సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మాల్ బయట రెండు గ్రూపులు ఘర్షణ పడ్డాయి. ఒకరిపై ఒకరు క్రికెట్ బ్యాట్‌లు, వికెట్లతో విపరీతంగా కొట్టుకున్నారు. పైగా ఆ రోడ్డు చాలా రద్దీగా ఉంది. ఆ టైంలో వారు ఒకరిపై ఒకరు దాడిచేసుకుంటూ ట్రాఫిక్ కు అంతరాయం కూడా కలిగించారు. దీనిని కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. అయితే కొందరు దెబ్బలకు తట్టుకోలేక కుప్పకూలిపోయారు. అయినా సరే అవతలి వాళ్లు.. వారిని వదిలిపెట్టకుండా బాదేశారు. అనంతరం క్రికెట్ బ్యాట్‌లను కారులో పెట్టుకుని వెళ్లిపోయారు.

శనివారం ఈ స్ట్రీట్ ఫైట్ జరిగిందని స్థానిక పోలీసులు తెలిపారు. ఈ సంఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారని, వారిలో ఒకరిని ఆసుపత్రికి తరలించినట్లు పీల్ రీజినల్ పోలీస్ కానిస్టేబుల్ హిమ్మెట్ గిల్ టొరంటో సిటీ న్యూస్‌తో వెల్లడించారు. ఈమేరకు మరో నలుగురు వ్యక్తుల కోసం పోలీసులు వెతుకుతున్నారు.

ఈ మేరకు నెటిజన్లు కామెంట్లతో వారిని చీల్చి చెండాడారు. పోలీసులు ఈమేరకు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కెనడాలో ఇలాంటి స్ట్రీట్ ఫైట్‌లో సాధారమేనంటూ కొందరు కామెంట్ చేయగా, అంత బిజీ రోడ్డులో అలా కొట్టుకుంటారా అంటూ ఫైర్ అయ్యారు.

Also Read:

Viral Video: మందు బాటిళ్లపై మతిపోగొట్టే ఫోజు.. వీడియో చూస్తే అస్సలు నవ్వాపుకోలేరు.!

Viral Video: బిజీ రోడ్డుపైకి బుజ్జి కుక్కలు.. దారి తప్పిన వాటిని ఓ దరి చేర్చిన మహిళంటూ నెటిజన్ల భావోద్వేగం! వైరలవుతోన్న వీడియో

Viral Video: బర్త్‌డే పార్టీకి సింహం చీఫ్ గెస్ట్.. వైరల్‌గా మారిన వీడియో.. చివర్లో అదిరిపోయే ట్విస్ట్!