Bullet Bandi Song: సంగీతానికి రాళ్లు కరుగుతాయో లేదో తెలియదు గానీ రోగుల్లో మాత్రం మార్పు తెస్తోంది. తెలుగు రాష్ట్రాలను ఊపేస్తున్న బుల్లెట్టు బండి పాట ఓ రోగిలో చలనం తెచ్చింది. ఆస్పత్రి బెడ్ పై కదల్లేకుండా పడివున్న రోగి.. బుల్లెట్టు బండి పాట పెట్టగానే డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు.
బుల్లెట్టు బండి పాట ప్రస్తుతం హల్‌చల్ చేస్తోంది. మోహన భోగరాజు ఆ పాటలో అభినయంతో ఆకట్టుకోగా చాలామంది అనుకరిస్తూ బీట్‌కు తగ్గట్టుగా వీడియోలు చేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది ఈ పాటకు కాళ్లు కదపగా.. తాజాగా మరోమారు ఈ పాట వీడియో సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అయ్యి చక్కర్లు కొడుతోంది.
హాస్పిటల్ లో పక్షవాతంతో మంచంపట్టిన ఓ వ్యక్తి త్వరగా కోలుకునేందుకు ఒక నర్సు వినూత్న ఆలోచన చేసింది. బుల్లెట్టు బండి పాటకు ఇలా డ్యాన్స్ చేసేందుకు ప్రయత్నించేలా ప్రేరేపించింది. అతడికి పక్కనే ఉన్న నర్స్ సహాయం చేస్తూ.. ప్రొత్సహిస్తోంది. నెట్టింట హల్‌చల్ చేస్తున్న ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.
ఒక పాట ఓ రోగి మెదడును ఉల్లాసపరుస్తూ, దేహకదలికలపై కంట్రోల్ తీసుకొస్తూ, ఓ ఫిజియోథెరపీగా ఉపయోగపడుతుందని కొందరు కామెంట్ చేయగా, పక్షవాతంతో పడిపోయిన ఓ చేయిని తిరిగి రోగి స్వాధీనంలోకి తీసుకురావడానికి పాటే మందుగా, మర్దనగా, ప్రేరణగా వాడుతున్న నర్స్ పనితనానికి మరికొందరు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎక్కడ జరిగిందో ఈ సంఘటన తెలియదు గానీ ఇంటర్ నెట్‌లో దూసుకుపోతోంది.
Read also: CM Jagan: 10 లక్షల మందికి ఉద్యోగావకాశాలు.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్