Lion-Buffalo: దోమలు చేసిన నిర్వాకం.. సింహం – గేదె కి మధ్య ఏం జరిగిందంటే.?

Lion-Buffalo: దోమలు చేసిన నిర్వాకం.. సింహం - గేదె కి మధ్య ఏం జరిగిందంటే.?

|

Updated on: Oct 12, 2024 | 6:23 PM

పులులు, సింహాల వేటలో అప్పుడప్పుడు సినిమా తరహా ట్విస్టులు చోటు చేసుకుంటుంటాయి. కొన్నిసార్లు నోటి దాకా వచ్చిన వేట.. ఉన్నట్టుండి చేజారిపోతుంటుంది. మరికొన్నిసార్లు చిన్న చిన్న జంతువులు కూడా తిరుగుబాటు చేసి తప్పించుకుంటుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, సింహం, గేదెకు సంబంధిచిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.

పులులు, సింహాల వేటలో అప్పుడప్పుడు సినిమా తరహా ట్విస్టులు చోటు చేసుకుంటుంటాయి. కొన్నిసార్లు నోటి దాకా వచ్చిన వేట.. ఉన్నట్టుండి చేజారిపోతుంటుంది. మరికొన్నిసార్లు చిన్న చిన్న జంతువులు కూడా తిరుగుబాటు చేసి తప్పించుకుంటుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, సింహం, గేదెకు సంబంధిచిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ గేదె సింహాన్ని చూసి భయంతో పొదల్లో దాక్కుంది. అయితే చివరకు దోమలు చేసిన నిర్వాకంతో ఏం జరిగిందో చూడండి..

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఆకలితో ఉన్న ఓ పెద్ద సింహం.. వేట కోసం పొదల మధ్యలో ఎదురు చూస్తూ ఉంది. అదే పొదల్లో ఓ అడవి గేదె కూడా ఉంది. సింహాన్ని చూసి ప్రాణ భయంతో ఆ పొదల మధ్యన సింహానికి కనిపించకుండా నక్కి కూర్చుంది. అయితే పాపం మాయదారి దోమలు ఆ గేదెను చుట్టేసాయి. ఆ దోమలను తోలుకునే క్రమంలో గేదె కదలింది. అంతే సింహం పసిగట్టేసింది. ఇంకేముంది వెంటనే దానిపై దాడి చేసింది. పాపం తప్పించుకున్నాను అనుకునేలోపే ఆ గేదె సింహానికి ఆహారమైపోయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియోను ఒకటిన్నుర మిలియన్లమంది వీక్షించగా, 50 వేలమందికి పైగా లైక్‌ చేశారు. వివిధ రకాల ఎమోజీలతో కామెంట్లు చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us