పెళ్లికి ఒక్క రోజు ముందే పారిపోయింది.. ఎందుకు అలా అంటే ??

పెళ్లికి ఒక్క రోజు ముందే పారిపోయింది.. ఎందుకు అలా అంటే ??

Phani CH

|

Updated on: Jun 12, 2023 | 9:51 PM

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఓ వ‌ధువు త‌న పెళ్లికి ఒక రోజు ముందే ఇంటి నుంచి ప‌రారీ అయ్యింది. ఆ అమ్మాయి ఎందుకు వెళ్లిందో, ఎక్క‌డికి వెళ్లిందో తెలుసుకుంటే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. వివ‌రాల్లోకి వెళ్తే.. జౌనుపూర్‌కు చెందిన ఓ అమ్మాయికి మీర్జాపూర్‌కు చెందిన యువ‌కుడితో పెళ్లి ఫిక్సైంది. అయితే కొన్ని పెళ్లి తంతులు కూడా జ‌రిగాయి.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఓ వ‌ధువు త‌న పెళ్లికి ఒక రోజు ముందే ఇంటి నుంచి ప‌రారీ అయ్యింది. ఆ అమ్మాయి ఎందుకు వెళ్లిందో, ఎక్క‌డికి వెళ్లిందో తెలుసుకుంటే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. వివ‌రాల్లోకి వెళ్తే.. జౌనుపూర్‌కు చెందిన ఓ అమ్మాయికి మీర్జాపూర్‌కు చెందిన యువ‌కుడితో పెళ్లి ఫిక్సైంది. అయితే కొన్ని పెళ్లి తంతులు కూడా జ‌రిగాయి. కానీ పెళ్లికి ఒక్క రోజు ముందే ఆ వ‌ధువు ఇంట్లో ఎవ్వ‌రికీ చెప్ప‌కుండా పారిపోయింది. పెళ్లి కూతురు మిస్సైన‌ట్లు తెలుసుకున్న ఫ్యామిలీ స‌భ్యులు హైరానాలో ప‌డిపోయారు. ఆమె కోసం ఊరంతా వెతికారు. చివ‌రకు ఆ రోజు రాత్రి ఆ అమ్మాయి తండ్రి పోలీసుల‌కు ఫిర్యాదు కూడా చేశాడు. ఇక ఈ లోపు మ‌రో సంఘ‌ట‌న జ‌రిగింది. పెళ్లి కూతురు పారిపోవ‌డంతో.. వ‌రుడికి మ‌రో అమ్మాయితో పెళ్లి చేయాల‌ని వ‌ధువు బంధువులు ఫిక్స్ అయ్యారు. వాళ్లు చేసిన ప్ర‌పోజ‌ల్‌కు వ‌రుడి బంధువులు కూడా ఓకే చెప్పేశారు. ఆ వెడ్డింగ్‌ను గ్రాండ్‌గా నిర్వ‌హించారు. ఆ పెళ్లి ముగిసాక పారిపోయిన అమ్మాయి ఆచూకీ పోలీసుల‌కు చిక్కింది. ఊళ్లో ఉన్న ఓ ప్రైమ‌రీ స్కూల్‌లోనే ఆమె త‌ల‌దాచుకున్న‌ది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

లగ్జరీ లైఫ్‌ కాదని సామాన్యుడిలా జీవిస్తున్న జిమ్మీ నావల్‌ టాటా

మెట్రోలో యువకుల వింత చేష్టలు.. షాక్‌లో ప్రయాణికులు..

విదేశాల్లో ఉన్న కొడుకుని తలచుకుంటూ వంటచేస్తున్న అమ్మ.. ఇంతలో..

ఇదేం పిచ్చిరా నాయనా.. మొసలి నోట్లో తల.. సీన్ కట్ చేస్తే

సహజీవనం చేస్తున్న భాగస్వామిని ముక్కలుగా కోసి కుక్కర్‌లో ఉడికించి