మీకు అగ్రిమెంట్ పెళ్లి తెలుసా.. పవిత్రబంధం సినిమాలో చూశాం అంటారా.. అదే అదే మీరు అనుకుంటున్నది కరెక్టే. ఆ సినిమాలో హీరో హీరోయిన్లు ఒక సంవత్సరం పాటు కలిసి ఉండేలా అగ్రిమెంట్ చేసుకుని పెళ్లి చేసుకుంటారు. ఈ విధానం ఆ రోజుల్లో సంచలనం రేపినా కొందరిని ఆలోచింపజేసింది. అయితే ఈ టాపిక్ ఇప్పుడు ఎందుకు అంటారా..? ఏమీ లేదండీ..! సోషల్ మీడియాలో అగ్రిమెంట్ మ్యారెజీ బాండ్ పేపర్ (Bond Paper Marriage) తెగ చక్కర్లు కొడుతోంది. హర్షు సంగ్తానీ అనే యువతి.. తనకు కాబోయే భర్త (Broom) కరణ్ నుంచి కొన్ని వాగ్దానాలను కోరుకుంటూ వధువు (Bride) వాటిని వంద రూపాయల బాండ్ పేపర్ పై రాయించింది. కండిషన్స్ అప్లై అంటూ అంటూ ఐదంటే ఐదు షరుతుల్ని వివరంగా రాయించి, కాబోయే భర్తతో సంతకం పెట్టించుకుంది. దాన్ని లామినేషన్ చేయించి, భద్రంగా దాచుకుంది. అయితే ఆ అగ్రిమెంట్ బాండ్ లో ఏమేం విషయాలు ఉన్నాయో తెలిస్తే మీరు అవాక్కవుతారు. ప్రస్తుతం ఈ కాంట్రాక్ట్ బాండ్ పేపర్ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీతంగా హల్‌చల్ చేస్తోంది.
Also Read
Women’s World Cup 2022: టీమిండియాకు సెమీ-ఫైనల్ ఛాన్స్.. కివీస్, ఇంగ్లండ్ మ్యాచ్ తర్వాత మారిన లక్?
Jobs for Women: మహిళలకు శుభవార్త.. 2024 నాటికి 50% ఉద్యోగాలు మహిళలకు ఇస్తామన్న ఆ కంపెనీ..