Seema Patra: పనిమనిషిపై దాష్టీకం.. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో సంచలన తీర్పు.. !(వీడియో)
బీజేపీ నుంచి సస్పెండ్ అయిన జార్ఖండ్ మహిళా నాయకురాలు సీమ పాత్రను రాంచీ పోలీసులు అరెస్టు చేశారు. గరిజన తెగకు చెందిన పనిమనిషిని చిత్రహింసలు పెట్టిందనే...
బీజేపీ నుంచి సస్పెండ్ అయిన జార్ఖండ్ మహిళా నాయకురాలు సీమ పాత్రను రాంచీ పోలీసులు అరెస్టు చేశారు. గరిజన తెగకు చెందిన పనిమనిషిని చిత్రహింసలు పెట్టిందనే ఆరోపణలతో అదుపులోకి తీసుకున్నారు. ఆమెను కోర్టులో హాజరుపరిచిన అనంతరం జైలుకు తరలిస్తామని అధికారులు చెప్పారు. సీమా ఇంట్లో పనిచేసే సునీత శరీరం, ముఖంపై తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న వీడియో ఒకటి ఇటీవల సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. 29 ఏళ్ల సునీత కొన్నేళ్ల క్రితం రాంచీలోని అశోక్‌నగర్ ప్రాంతంలో గల సీమా పాత్ర నివాసంలో పనికి చేరింది. సునీతను సీమా చిత్ర హింసలకు గురిచేస్తున్నట్లు స్థానికులు కొందరు సమాచారమివ్వడంతో పోలీసులు ఆమెను రక్షించారు. తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సీమా పాత్రా తనను బంధించి తీవ్రంగా హింసించారని సునీత ఆ వీడియో ద్వారా తెలిపింది. కొన్ని సార్లు ఇనుప రాడ్లతో కూడా కొట్టేవారని, అలా ఓసారి తన పన్ను కూడా విరిగిపోయిందని తెలిపింది. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత పరారీలో ఉన్న సీమా పాత్రను పోలీసులు అరెస్ట్ చేశారు. సీమా పాత్రా బీజేపీ మహిళా విభాగం జాతీయ వర్కింగ్ కమిటీలో సభ్యురాలిగా ఉన్నారు. ఆమె భర్త మహేశ్వర్ పాత్రా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. పనిమనిషి వీడియో వైరల్‌గా మారిన తర్వాత సీమాను బీజేపీ సస్పెండ్ చేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

