ఒక్క నీటిబొట్టు చాలు.. ప్రాణం నిలపడానికి.. గుండెను పిండేస్తున్న వీడియో..!
దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. ఎండలకు మనుషులే అల్లాడిపోతుంటే..చిన్న ప్రాణాలైన పక్షుల పరిస్థితి ఏంటి?
దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. ఎండలకు మనుషులే అల్లాడిపోతుంటే..చిన్న ప్రాణాలైన పక్షుల పరిస్థితి ఏంటి?. అవును.. ఈ ఎండల తీవ్రతను తట్టుకోలేక పక్షులు విలవిల్లాడిపోతున్నాయి. తాగేందుకు చుక్క నీరు దొరక్క పిట్టలు ప్రాణాలు కోల్పోతున్నాయి. తాజాగా ఈ దారుణ పరిస్థితికి అద్దం పట్టే ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో ప్రజల హృదయాలను పిండేస్తుంది. ఎండ వేడిమికి తాళలేక ఓ పక్షి రోడ్డుపై పడిపోయింది. ఆ పక్షిని గమనించిన ఓ వాహనదారుడు.. వెంటనే దాని వద్దకు వచ్చాడు. బాటిల్‌లో నీటిని క్యాప్‌లో పోసి దానికి తాపించాడు. ఎండవేడిమికి తాళలేక కొనప్రాణాలతో కొట్టామిట్టాడుతున్న ఆ పక్షికి నీటి బొట్టు గొంతులో పడగానే ప్రాణం లేచివచ్చింది. అప్పటి వరకు కునారిల్లిన ఆ పక్షి.. నీరు అందగానే కాస్త కోలుకుని లేచి నిలబడింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆకలితో ఉన్న పిల్లి.. తన యజమానిని ఏం చేసిందో చూడండి !!
నిత్య యవ్వనంగా ఉండాలంటే రోజుకో బాటిల్ తాగాల్సిందే !! ఇంతకీ ఏంటో తెలుసా ??