ఆకలితో ఉన్న పిల్లి.. తన యజమానిని ఏం చేసిందో చూడండి !!

సోషల్‌ మీడియాలో మనం ప్రతిరోజూ అనేక ఫన్నీ వీడియోలు చూస్తుంటాం. వాటిలో పెంపుడు జంతువుల విన్యాసాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి.

Phani CH

|

May 10, 2022 | 8:00 PM

సోషల్‌ మీడియాలో మనం ప్రతిరోజూ అనేక ఫన్నీ వీడియోలు చూస్తుంటాం. వాటిలో పెంపుడు జంతువుల విన్యాసాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో ఓ పిల్లికి సంబంధించింది. ఈ వీడియోలో ఓ పిల్లి, తన యజమానితో కలిసి డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కూర్చుంది. తన యజమాని టిఫిన్‌ చేస్తున్నాడు. అయితే ఈ పిల్లికి ఏమీ పెట్టలేదు. పాపం పిల్లికేమో విపరీతంగా ఆకలేస్తోంది. అది అరిచి చెబుదామంటే అతనికి చెవులు వినపడవు. దాంతో ఏం చేయాలో తోచలేదు. అతను తనవైపు చూడకపోతాడా.. తనకు ఫుడ్‌ పెట్టక పోతాడా అని వెయిట్‌ చేసింది. కానీ ఎప్పటికీ అతను పెట్టకపోయేసరికి సైగలు చేస్తూ తనే అడిగింది. ఆ వ్యక్తిని తన కాలితో తట్టి తనకు భోజనం పెట్టమంటూ అచ్చం మనిషిలాగే సైగలు చేసింది. అప్పుడు ఆ వ్యక్తి ఆ పిల్లికి ఫుడ్‌ తినిపించాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నిత్య యవ్వనంగా ఉండాలంటే రోజుకో బాటిల్ తాగాల్సిందే !! ఇంతకీ ఏంటో తెలుసా ??

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu