కూన కోసం పులితో భీకర యుద్ధం చేసిన ఎలుగుబంటి
ఎవరైనా తన పిల్లల జోలికి వచ్చినా, హాని కలిగించాలని చూసినా ఏ తల్లీ ఊరుకోదు. ఎంతటి ప్రమాదకరమైన పరిస్థితి ఎదురైనా తమ పిల్లలను కాపాడుకోవడానికి ఎదురెళ్తుంది. కేవలం మానవుల్లోనే కాదు.. జంతువుల్లోనూ తల్లి ప్రేమ ఒకేలా ఉంటుందన్న విషయం మరోసారి రుజువైంది. ఓ ఎలుగుబంటి తన కూనను కాపాడుకోవడానికి పులికి ఎదురెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.
ఎవరైనా తన పిల్లల జోలికి వచ్చినా, హాని కలిగించాలని చూసినా ఏ తల్లీ ఊరుకోదు. ఎంతటి ప్రమాదకరమైన పరిస్థితి ఎదురైనా తమ పిల్లలను కాపాడుకోవడానికి ఎదురెళ్తుంది. కేవలం మానవుల్లోనే కాదు.. జంతువుల్లోనూ తల్లి ప్రేమ ఒకేలా ఉంటుందన్న విషయం మరోసారి రుజువైంది. ఓ ఎలుగుబంటి తన కూనను కాపాడుకోవడానికి పులికి ఎదురెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. మహారాష్ట్రలోని తాడోబా-అంధేరి టైగర్ రిజర్వ్‌ఫారెస్టులో నివసించే ఓ ఎలుగుబంటి తన పిల్లలతో తిరుగుతుండగా.. ఆ సమయంలో ఒక్కసారిగా పులి ఓ ఎలుగు కూనపై దాడి చేసింది. దీంతో ఎలుగుబంటి తన పిల్లను కాపాడుకోవడానికి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఏకంగా పులిని బెదిరించడమే కాక పరుగులు పెట్టించింది. ఆ విరోచిత పోరాటానికి పులి తోక ముడిచి అక్కడి నుంచి పారిపోయింది. దీనిని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్‌గా మారింది. ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘తన పిల్ల కోసం తల్లి ఎంత ధైర్యం ప్రదర్శించిందో’ అంటూ ప్రశంసించారు. మరో నెటిజన్ స్పందిస్తూ ‘తల్లులు తమ పిల్లలను కాపాడుకోవడానికి ఎటువంటి పరిస్థితిని అయినా ఎదుర్కొంటారు’ అంటూ రాసుకొచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గాడిద పాల వ్యాపారం పేరుతో టోపీ.. రూ.9 కోట్లతో చెక్కేశాడు
ఐవీఎఫ్ విధానంలో పుట్టిన పిల్లలకు గుండె జబ్బుల ముప్పు
కామాంధుడైన కోటీశ్వరుడు.. 60 మందిపై ఉద్యోగినులపై అత్యాచారం
డాక్టర్స్ కాన్ఫరెన్స్‌లో లేడీ డ్యాన్సర్ చిందులు.. రెచ్చిపోయిన నెటిజన్లు..