గాడిద పాల వ్యాపారం పేరుతో టోపీ.. రూ.9 కోట్లతో చెక్కేశాడు
గాడిద పాల వ్యాపారం పేరుతో కర్ణాటక రైతులను నిండా ముంచాడు ఏపీకి చెందిన ఓ ప్రబుద్ధుడు. సుమారు 2వందల మంది రైతుల నుంచి ఏకంగా రూ. 9 కోట్లు వసూలు చేశాడు. సమయం చూసి ఎస్కేప్ అయ్యాడు. తాము నిండా మోసపోయామని తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన నూతలపాటి మురళి అనే వ్యక్తి మూడు నెలల క్రితం జెన్నీ మిల్క్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశాడు.
గాడిద పాల వ్యాపారం పేరుతో కర్ణాటక రైతులను నిండా ముంచాడు ఏపీకి చెందిన ఓ ప్రబుద్ధుడు. సుమారు 2వందల మంది రైతుల నుంచి ఏకంగా రూ. 9 కోట్లు వసూలు చేశాడు. సమయం చూసి ఎస్కేప్ అయ్యాడు. తాము నిండా మోసపోయామని తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన నూతలపాటి మురళి అనే వ్యక్తి మూడు నెలల క్రితం జెన్నీ మిల్క్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. కర్ణాటకలోని హోస్పేట్‌లో హంగూ, ఆర్భాటాలతో గాడిద పాల వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఈ వ్యాపారం చేస్తూ లక్షలు సంపాదించవచ్చని జనాన్ని నమ్మించాడు. గాడిద పాల వ్యాపారం చేయాలనుకునేవాళ్లు తమ సంస్థకు డిపాజిట్ కింద రూ. 3 లక్షలు చెల్లించాలని మురళి.. షరతు పెట్టాడు. డిపాజిట్ చేసిన వారికి మూడు గాడిదలు ఇస్తామని చెప్పాడు. వాటిని పెంచి, పోషించి పాలు పితికి ఇస్తే లీటర్‌కు రెండు వేల రూపాయలు చెల్లిస్తానని నమ్మబలికాడు. ఇది నిజమేనని నమ్మిన సుమారు రెండు వందల మంది రైతులు రూ.3 లక్షల చొప్పున సంస్థకు చెల్లించుకున్నారు. లక్షలు పోసి గాడిదలను తీసుకెళ్లారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఐవీఎఫ్ విధానంలో పుట్టిన పిల్లలకు గుండె జబ్బుల ముప్పు
కామాంధుడైన కోటీశ్వరుడు.. 60 మందిపై ఉద్యోగినులపై అత్యాచారం
డాక్టర్స్ కాన్ఫరెన్స్‌లో లేడీ డ్యాన్సర్ చిందులు.. రెచ్చిపోయిన నెటిజన్లు..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

