పంట కాలువలో కొట్టుకుపోయిన కారు డ్రైవర్ ఏమయ్యాడంటే
బాపట్ల జిల్లా కొమ్మాలపాడు వద్ద అద్దంకి-నార్కెట్పల్లి రోడ్డుపై కారు కాలువలోకి దూసుకెళ్లింది. స్థానికులు, స్నానం చేస్తున్న అయ్యప్ప భక్తులు డ్రైవర్‌ను సురక్షితంగా రక్షించారు. అయితే, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగానే డ్రైవర్ పవన్ కుమార్ పరారయ్యాడు. మోటార్ సైకిల్‌ను తప్పించే క్రమంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు దగ్గర అద్దంకి – నార్కెట్పల్లి రోడ్డుపై కారు అదుపుతప్పి ఎన్ ఎస్ పి కాలువలోకి దూసుకెళ్ళింది. కాలువలో కొట్టుకుపోతున్న కారును గమనించారు స్థానికులు… కారు నుంచి బయటకు రాలేక ప్రాణభయంతో కేకలు వేస్తున్న డ్రైవర్‌ను గుర్తించి కాపాడారు… అదే సమయంలో కాలువలో స్నానాలు చేస్తున్న అయ్యప్పస్వాముల కంట పడటంతో వెంటనే కారులో ఉన్న డ్రైవర్ను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. వినుకొండ నుండి ఒంగోలు వెళ్తున్న కారు కి మోటార్ సైకిల్ అడ్డురావడంతో మోటార్ సైకిల్ ను తప్పించే క్రమంలో కారు కాలువలోకి దూసుకెళ్లింది. కారులో ఉన్న డ్రైవర్ నీటి ప్రవాహం కారణంగా మునిగిపోతున్న కారు నుంచి బయటకు రాలేక హాహాకారాలు చేశాడు…అదే సమయంలో కాలువలో స్నానాలు చేస్తున్న కొందరు అయ్యప్ప స్వామి భక్తులు కారులో ఉన్న వ్యక్తిని గమనించి కారు దగ్గరకు చేరుకున్నారు… కారులో చిక్కుకున్న డ్రైవర్‌ను సురక్షితంగా బయటకు తీశారు… అయితే కారు కాలువలో మునిగిపోయింది… ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు… కారులో ఉన్న వ్యక్తిని వివరాలు అడగటానికి ప్రయత్నించగా అతను అక్కడ నుండి పారిపోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కారులో ఉన్న వ్యక్తిని కంచికచర్ల పవన్ కుమార్‌గా గుర్తించి దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రియుడి మోసం.. బిడ్డను అమ్మకానికి పెట్టిన తల్లి
ఏడాదిగా కోమాలో కొడుకు.. ఆలయం ముందు పడుకోబెటిన తండ్రి.. కట్ చేస్తే
కూతురి మరణం తట్టుకోలేక తల్లి ఆత్మ హత్య
పదోతరగతి పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ ఇదే
Tomato Price: బంగారంతో పోటీపడుతున్న టమాటా.. బాబోయ్.. ఏంటి ఆ ప్రైజ్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

